'ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత గేమ్‌లో తప్పు చేశాడు'

Did Rafael Nadal break crucial rule during French Open final? Former players question Roland Garros officials

హైదరాబాద్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. 11వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను 6-4, 6-3, 6-2 సెట్ల తేడాతో చిత్తుగా ఓడించాడు. అయితే ఫైనల్‌ సమరంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడనే విమర్శలు నాదల్‌పై ఇప్పుడు మొదలయ్యాయి.

 ఫైనల్‌ పోరు సందర్భంగా 3సెట్‌ సమయంలో

ఫైనల్‌ పోరు సందర్భంగా 3సెట్‌ సమయంలో

ఫిలిప్పె ఛాట్రైర్‌ కోర్టులో జరిగిన ఫైనల్‌ పోరు సందర్భంగా మూడో సెట్‌ సమయంలో నాదల్‌ తన ఫిజిషియన్‌ను కోర్టులోకి రప్పించి మణికట్టుకు చికిత్స చేయించుకున్నాడు. అయితే అలా చికిత్స చేయించుకోవటం టోర్నీ రూల్స్‌ ప్రకారం విరుద్ధం. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.

 మినహాయింపు ఎందుకిచ్చారు

మినహాయింపు ఎందుకిచ్చారు

ఈ టోర్నీలో రాబిన్ హాసే(నెదర్లాండ్స్‌)‌, డెవిడ్‌ గొఫ్ఫిన్‌ (బెల్జియం) మ్యాచ్‌ సందర్భంగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే చైర్‌ అంఫైర్లు మాత్రం చికిత్సకు నిరాకరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రుసెదిస్కి టోర్నీ నిర్వాహకులపై మండిపడ్డాడు. ‘నాదల్స్‌కు రూల్స్‌ వర్తించవా? అతనికి మినహాయింపు ఎందుకిచ్చారు? అతనికి శిక్ష పడాల్సిందే... అంటూ రుసెదిస్కి కోరుతున్నారు.

చికిత్స చేయించుకోవటం ముమ్మాటికీ నేరమే

చికిత్స చేయించుకోవటం ముమ్మాటికీ నేరమే

నాదల్‌ చేసింది ఘోర తప్పిదమని టెన్నిస్‌ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ‘అలాంటప్పుడు మెడికల్‌ టైమ్‌ అవుట్‌లో తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నించొచ్చు. కానీ, ఇలా సెట్‌ మధ్యలో ఉండగా ఫిజిషియన్‌ను రప్పించుకుని చికిత్స చేయించుకోవటం మాత్రం ముమ్మాటికీ నేరమే' అని మాజీ ఆటగాడు గ్రెగ్‌ రుసెదిస్కి చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో నాదల్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని మరో దిగ్గజం అన్నాబెల్‌ క్రోఫ్ట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ నిర్వాహకులను డిమాండ్‌ చేస్తున్నారు.

చేతి కండరాలు పట్టేయటంతో

చేతి కండరాలు పట్టేయటంతో

వివాదంపై నాదల్‌ స్పందించాడు. చేతి కండరాలు పట్టేయటంతోనే ఫిజీషియన్‌ను పిలిపించుకున్నట్లు తెలిపాడు. సెమీస్‌ నుంచే తనకు నొప్పి వేధించిందని, ఈ వివాదాన్ని అనవసరంగా పెద్దది చేయొద్దంటూ.. ఆయన మాజీలకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Story first published: Monday, June 11, 2018, 16:26 [IST]
    Other articles published on Jun 11, 2018
    POLLS

    Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more