యుఎస్ ఓపెన్‌లో సంచలనం: డెల్ పొట్రో చేతిలో ఫెదరర్ ఓటమి
హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఈసారి సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఐదు సార్లు ఛాంపియన్ అయిన రోజర్ ఫెదరర్‌ను అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పొట్రో ఖంగు తినిపించాడు.
ఆర్థర్ ఆషె స్టేడియంలో హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు డెల్‌ప్రోటో చేతిలో 7-5, 3-6, 7-7, 6-4 తేడాతో ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇక్కడే ఫెదరర్‌పై గెలిచి కెరీర్‌లో ఏకైక గ్రాండ్‌స్లామ్ గెలిచిన డెల్ పోట్రో.. మళ్లీ ఇన్నాళ్లకు ఫెదరర్‌కు షాకిచ్చాడు.

తొలి రెండు రౌండ్లలోనూ ఐదు సెట్ల పాటు పోరాడాల్సి వచ్చింది. చివరికి కాస్త గట్టి ప్రత్యర్థి క్వార్టర్స్‌లో ఎదురవడంతో ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. దీంతో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఫెదరర్, రఫెల్ నాదల్ పోరు చూడాలనుకున్న అభిమానుల ఆశలు తీరలేదు.
అంతేకాదు 2009 ఫైనల్లో ఓడించిన పొట్రోను ఓడించి కసితీర్చుకోవాలనుకున్న ఫెదరర్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్‌లో గనుకు ఫెదరర్ గెలిచి ఉంటే సెమీస్‌లో నాదల్‌తో పోటీ పడేవాడు. అయితే ఇప్పుడు శుక్రవారం జరగబోయే సెమీస్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న నాదల్‌తో డెల్‌పోట్రో పోటీ పడనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications