హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్‌కు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మధ్య కొంతకాలం ఎఫైర్ కొనసాగినట్లు తాజాగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన భార్య జెలీనాతో వచ్చిన మనస్పర్థల కారణంగా వారు విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
2014లో జెలీనాని జొకొవిచ్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కొడుకు ఉండగా.. జెలెనా మళ్లీ గర్భవతి. గతంలో జొకొవిచ్‌తో సహజీవనం చేసిన సెర్బియన్ పాప్ స్టార్ నటాషా బెక్వాలాచ్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జొకోవిచ్‌కి దీపికా పదుకొణె అంటేనే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో ఆమె తాజాగా వెల్లడించింది.
తన భార్యతో కంటే.. దీపికeతో డేటింగ్‌లో జొకోవిచ్ ఎంతో ఆనందంగా ఉంటాడని బాంబు పేల్చింది. దీపికా 'ట్రిపులెక్స్' చిత్రంలో నటిస్తున్నప్పుడు అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో దీపికా జొకోవిచ్‌తో కలిసి రాత్రి డిన్నర్ డేట్‌కి వెళ్లిన ఫొటోలు మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి మీడియా ఆమెను దీపికాగా గుర్తించలేదు.
కేవలం 'జొకోవిచ్ తన ప్రేయసితో వచ్చాడు' అని హెడ్‌లైన్స్‌లో పేర్కొన్నాయి. డిన్నర్ అనంతరం జొకొవిచ్, దీపికా ఒకే కారులో వెళ్లడం, మీడియాని చూసి దీపికా తల దించుకున్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 2015, వింబుల్డన్ ఫైనల్ సందర్భంగా జెలెనాతో పదుకొణె మాట్లాడుతూ కనిపించింది.
అంతేకాకుండా ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) సందర్భంగా దీపికా, జొకోవిచ్‌లు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలి కాలంలో నొవాక్ జొకొవిచ్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. తాజాగా భార్య జెలీనాతో జొకో గొడవపడుతుండగా తీసిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.
తాజాగా ఈ ఫోటోల గురించి నటాషా ఓ ఇంటర్యూలో స్పందించింది. కేవలం దీపికాతో మాత్రమే కాకుండా జెలీనాను పెళ్లి చేసుకోవడానికి ముందు జకోవిచ్ చాలా మందితో డేటింగ్ చేశారని నటాషా చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే 2011 నుంచి 2014 మధ్య కాలంలో నటాషా... జొకొవిచ్‌తో డేటింగ్ చేసింది.