Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జొకోవిచ్‌తో డేటింగ్: బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్‌లో దీపికా పదుకునే

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకునే ఒకరు. తమషాలో తార, బాజీరావ్ మస్తానీలో మస్తానీగా మాత్రమే అభిమానులకు ఆమె సుపరిచితం. అయితే విదేశీ మీడియా మాత్రం ఆమెను 'ఫీమేల్ కంపానియన్' గా అభివర్ణించింది. ఇంతకీ ఎందుకిలా అభివర్ణించిందో అర్ధం కావడం లేదా?

Deepika Padukone goes on a dinner date with tennis ace Novak Djokovic

పురుషుల టెన్నిస్ విభాగంలో నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్న నొవాక్ జకోవిచ్‌తో దీపికా పదుకునే డేటింగ్ వెళ్లడమే ఇందుకు కారణం. ఇటీవల వీరిద్దరూ కలిసి లాస్ ఏంజెల్స్‌లోని ఓ నైట్ క్లబ్‌లో డిన్నర్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి.

దీంతో వీరిద్దరిపై విదేశీ మీడియా ఓ కథనాన్ని రాసింది. జోకోవిచ్ కొత్త స్నేహితురాలంటూ దీపికా పదుకునేపై ఆ కథనంలో పేర్కొంది. రెస్టారెంట్‌లో డిన్నర్ చేసిన వీరిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఒకే కారులో వెళ్లారని అందులో పేర్కొంది. జకోవిచ్ సాదాసీదాగా డిన్నర్ డేటింగ్‌కు వచ్చినా దీపికా మాత్రం అందంగా ముస్తాబవడం అక్కడ పెద్ద చర్చనీయాంశమైంది.

Deepika Padukone goes on a dinner date with tennis ace Novak Djokovic

మోకాళ్ల వరకు ఉండే బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్‌లో అందర్నీ ఇట్టే కట్టిపడేసింది. కాగా, ప్రస్తుతం దీపికా పదుకునే హాలీవుడ్ చిత్రం XXX: The Return of Xander Cage చిత్రం షూటింగ్ కోసం లాస్ ఏంజిల్స్ ఉన్నారు. లాస్ ఏంజిల్స్‌లోని పాపులర్ సెలబ్రిటీలు అందరూ ఎక్కువగా వచ్చే 'ద నైస్ గయ్' అనే రెస్టారెంట్‌కు ఈ కొత్త జంట వెళ్లినట్లు ఆ పత్రిక పేర్కొంది.

గతేడాది ఢిల్లీలో జరిగిన టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా జొకోవిచ్, దీపికా పదుకునే కలుసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+