Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డేవిస్ కప్ నుంచి తప్పుకున్న రోహన్‌ బోపన్న

 Davis Cup: Bopanna pulls out of tie against Pakistan due to shoulder injury

హైదరాబాద్: డేవిస్‌కప్‌లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌-1 మ్యాచ్‌‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లకు భారత సీనియర్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని భారత జట్టు నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌కు బోపన్న సమాచారం ఇచ్చాడు.

బోపన్న స్థానంలో జీవన్‌ నెడుంజెళియన్‌ జట్టులోకి వచ్చాడు. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఐటా) ఇటీవల ప్రకటించిన డేవిస్‌ కప్‌ జట్టులో జీవన్‌ నెడుంజెళియన్‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. నవంబర్ 29, 30 తేదీల్లో పాకిస్థాన్‌తో పురుషుల డబుల్స్‌లో మరో సీనియర్‌ లియాండర్‌ పేస్‌తో కలిసి బోపన్న ఆడాల్సి ఉంది.

అయితే, ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో భుజానికి గాయం అయినట్లు తెలియడంతో అతడు టోర్నీ నుంచి తప్పుకున్నాడు. సీనియర్ ప్లేయర్ బోపన్న టోర్నీ నుంచి వైదొలగడం కాస్త నిరాశ కలిగించిందని నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ రాజ్‌పాల్‌ చెప్పాడు. ఈ సందర్భంగా రాజ్‌పాల్ మాట్లాడుతూ "రోహన్ టోర్నీకి దూరం కావడం కాస్త నిరాశపరిచింది. బోపన్న తన గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని అన్నాడు.

"ట్రీట్‌మెంట్ కోసం అతనికి షాట్లు (ఇంజెక్షన్) అవసరం. అతడి స్థానాన్ని జీవన్‌తో భర్తీ చేస్తున్నాం. అతను ఈ టూర్‌లో బాగా ఆడాడు. కుడి ఎడమ కాంబినేషన్‌ కూడా కలిసివస్తుంది" అని నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ రాజ్‌పాల్‌ పేర్కొన్నాడు. బోపన్న టాప్ డబుల్స్ ప్లేయర్. అయితే, ఇప్పుడు ఇద్దరు అత్యుత్తమ ర్యాంక్ కలిగిన ఆటగాళ్ళు టై కోసం అందుబాటులో లేరు.

మరోవైపు తన వివాహ రిసెప్షన్ కారణంగా దివిజ్ శరణ్ కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. ఇక, ఈ మధ్యకాలంలో ఏటీపీ పర్యటనలో నిలకడగా ప్రదర్శన ఇవ్వడం ద్వారా జీవన్‌ నెడుంజెళియన్‌ భారత్ తరుపున డేవిస్ కప్ జట్టు బరిలోకి దిగుతున్నాడు.

Story first published: Tuesday, November 19, 2019, 10:24 [IST]
Other articles published on Nov 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+