డేవిస్ కప్: ఆరంభం అదిరింది, 2-0తో భారత్ ఆధిక్యం
హైదరాబాద్: న్యూజిలాండ్‌తో డేవిస్ కప్ మ్యాచ్‌లో తొలిరోజు భారత ఆటగాళ్లు సత్తా చాటారు. సింగిల్స్‌లో యుకీ భాంబ్రీ, రామ్‌కుమార్ ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో సింగిల్స్ ప్లేయర్లు యుకీ భాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ అలవోక విజయాలతో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
మొదటి సింగిల్స్‌లో యువీ 6-4, 6-4, 6-3తో ఫిన్ టెర్నేపై వరుస సెట్లలో సునాయాసంగా గెలుపొందాడు. ఆ తర్వాత, రెండో సింగిల్స్‌లో రామ్ కుమార్ 6-3, 6-4, 6-3తో జోస్ స్టాథమ్‌ను చిత్తుగా ఓడించాడు. ఇక అత్యధిక విజయాలతో ప్రపంచ రికార్డుపై కన్నేసిన వెటరన్ స్టార్ లియాండర్ పేస్ డబుల్స్ మ్యాచ్‌పైనే అందరి కళ్లున్నాయి.
భారత టెన్నిస్‌లో విజయవంతమైన ప్లేయర్‌గా పేరుగాంచిన వెటరన్ స్టార్ లియాండర్ పేస్ డేవిస్‌కప్‌తో కొత్త చరిత్రను సృష్టించేందుకు అడుగుదూరంలో నిలిచాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 43 డబుల్స్ మ్యాచ్‌లు నెగ్గిన పేస్ శనివారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తే అత్యధిక డబుల్స్ విజయాలు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు.

ఆద్యంతం ఆధిపత్యం సాగించిన యుకీ భాంబ్రీ
రెండుగంటలా పది నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 24ఏళ్ల యుకీ ఆద్యంతం ఆధిపత్యం సాగించాడు. తొలిసెట్‌ను 47నిమిషాల్లోనే నెగ్గిన యుకీ.. ఆరంభంలో 1-3తో వెనుకబడ్డా, ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు సొంతం చేసుకొని
5-3తో ఆధిక్యంలో నిలిచిన అతను పదో గేమ్‌లో పదునైన ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో 6-4తో సెట్‌ను గెలుచుకున్నాడు.

బ్రేక్ సాధించి 6-3తో సెట్ గెలిచాడు
ఇక రెండో సెట్లోనూ యుకి 0-2తో వెనకబడ్డాడు. అయితే వెంటనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన అతను ఆ తర్వాత స్కోరు సమం చేశాడు. ఆపై మరో బ్రేక్ సాధించి 6-3తో సెట్ గెలిచాడు. మూడో సెట్లో యుకి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండుసార్లు టియర్‌నె సర్వీస్ బ్రేక్ చేసిన ఈ దిల్లీ కుర్రాడు.. ఆ తర్వాత 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచాడు.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రామ్‌కుమార్
డేవిస్‌కప్ రూపంలో వచ్చిన అవకాశాన్ని తమిళ కుర్రాడు రామ్‌కుమార్ సద్వినియోగం చేసుకున్నాడు. పదునైన సర్వీస్‌లతో ఆకట్టుకున్న అతను, లాంగ్ ర్యాలీలతో సత్తా చాటాడు. ఏకంగా 15 ఏస్‌లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. నాలుగో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 3-1తో ఆధిక్యంలో నిలిచిన రామ్ అరగంటలోనే తొలి సెట్‌ను ఖాతా వేసుకున్నాడు.

రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ
రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో సెట్లో జోస్ పోరాడడంతో స్కోరు ఒక దశలో 3-3తో నిలిచింది. ఈ స్థితిలో ఏడో గేమ్‌లో సర్వీస్ బ్రేక్ చేసిన రామ్‌కుమార్ అదే వూపులో 6-3తో సెట్ నెగ్గాడు. క్లిష్ట సమయాల్లో తనదైన భారీ సర్వీసులతో గట్టెక్కాడు.

పదునైన ఏస్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు
రెండోసెట్‌లో భీకరమైన సర్వీస్‌లు, పదునైన ఏస్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. ఈ ఒక్కసెట్‌లోనే నాలుగు ఏస్‌లు సంధించిన రామ్‌కుమార్ ఆ తర్వాతి సెట్‌లో మరో 3ఏస్‌లు, 10విన్నర్లతో వరుసగా పాయింట్లు రాబట్టాడు. మూడో సెట్లోనూ రామ్‌కుమార్ బలమైన సర్వీసులతో విజృంభించాడు. నాలుగో గేమ్‌లో రెండు డబుల్ ఫాల్ట్స్‌తో ఒక దశలో 0-40తో వెనుకబడ్డ రామ్.. మూడు బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు.

ఐదో గేమ్‌లో స్టాథమ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు
పదునైన ఏస్‌తో తన సర్వీస్ కాపాడుకున్నాడు. ఏడో గేమ్‌లో కివీస్ ఆటగాడి సర్వీస్ బ్రేక్ చేసిన భారత ఆటగాడు ఆపై తన సర్వీస్ నిలబెట్టుకొని 5-3తో ముందంజ వేశాడు. పదో గేమ్‌లో సెట్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో ఏస్‌లతో మూడు బ్రేక్ పాయింట్లు కాచుకున్న రామ్.. ఐదో గేమ్‌లో స్టాథమ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. తొమ్మిదో గేమ్‌లో మరోసారి బ్రేక్ చేసిన అతను సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications