న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా vs పాకిస్తాన్: పటిష్ట భద్రత కల్పిస్తే పాకిస్థాన్‌లో ఆడతాం

Davis Cup 2019: Captain Mahesh Bhupathi and players seek assurance on security

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాళ్లు త్వరలో జరిగే డేవిస్‌కప్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇస్లామాబాద్ చేరుకోవడానికి ముందే అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని, పటిష్ట భద్రత కల్పిస్తే ఆడతాం అని కెప్టెన్‌గా మహేశ్‌ భూపతితో సహా ఆటగాళ్లు అందరూ తెలిపారు. భారత టెన్నిస్ ఆటగాళ్లు పటిష్ట భద్రత కోరడంపై అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సానుకూలంగా స్పందించింది. భద్రత చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాక్‌ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పాకిస్థాన్‌తో పోరుకు నిరాకరిస్తే.. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) భరత జట్టుపై నిషేధం విధించే అవకాశం ఉండటంతో భారత ఆటగాళ్లు పాక్‌తో ఆడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి కూడా లభించింది.

టెన్నిస్ వరల్డ్‌కప్‌లో భాగంగా సెప్టెంబర్‌ 14న ఇస్లామాబాద్‌ వేదికగా భారత్‌-పాక్‌ మధ్య ఆసియా, ఓసియానియా గ్రూప్‌ సమరం ప్రారంభం కానుంది. ప్రజ్నేష్ గున్నేశ్వరన్ నాయకత్వం వహించే భారత జట్టు డేవిస్‌కప్‌ కోసం 55 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్థాన్‌ వెళ్లబోతోంది. 1964 తర్వాత భారత డేవిస్‌కప్‌ జట్టు పాక్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి.

పాక్‌లో చివరిగా ఆడినప్పుడు భారత్‌ 4-0తో విజయం సాధించింది. డేవిస్‌ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ 6-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. పాకిస్థాన్‌ వెళ్లబోతున్న భారత జట్టును వచ్చే నెల 5న ఎంపిక చేయనున్నారు. గత ఫిబ్రవరిలో కోల్‌కతాలో ఇటలీతో తలపడిన జట్టే దాదాపు బరిలోకి దిగే అవకాశం ఉంది.

Story first published: Wednesday, July 31, 2019, 13:50 [IST]
Other articles published on Jul 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X