న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోటోలు: యుఎస్ ఓపెన్‌లో సరి కొత్త డ్రెస్ స్టయిల్‌తో సెరెనా

By Nageshwara Rao
Cornet: Banning Serenas catsuit 10,000 times worse

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఇప్పుడు కొత్త డ్రెస్సులో కనిపిస్తోంది. యుఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో సెరెనా టుటు డ్రెస్సులో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో సెరెనా బ్లాక్ క్యాట్ సూట్‌లో మెరిసిన సంగతి తెలిసిందే.

అప్పట్లో సెరెనా డ్రెస్సుపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి సెరెనా బ్లాక్ క్యాట్‌సూట్ వేసుకుంటే ఆడ‌నివ్వ‌మ‌ని ఇటీవ‌ల ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహాకులు తెలిపారు. అయినా సరే సెరెనా తన డ్రెస్సింగ్ స్టయిల్‌లో మాత్రం వెనక్కి తగ్గలేదు. బాలే డ్యాన్సుర్లు వేసుకునే టుటు డ్రెస్ స్ట‌యిల్‌లో యుఎస్ ఓపెన్‌లో సెరెనా అదరగొడుతోంది.

ప్రముఖ కాస్ట్యూమ్ డిజైన‌ర్ లూయిస్ విట్టాన్ డిజైన్ చేసిన టుటు ఫ్రాక్‌ను వేసుకుని సెరెనా మొదటి రెండు రౌండ్లలో అద్భుత ప్రదర్శన చేసింది. మ్యాచ్ అనంతరం సెరెనా మాట్లాడతూ "టుటు ఫ్రాక్‌లు ఈజీగా ఉంటాయ‌ని, అవి ఏరోడైన‌మిక్‌గా ప‌నిచేస్తాయి" అని పేర్కొంది. సెరెనా వేసుకున్న టుటు డ్రెస్ స్ట‌యిల్‌ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి.

Cornet: Banning Serenas catsuit 10,000 times worse

ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా అక్కా చెల్లెళ్లు సెరెనా విలియమ్స్‌, వీనస్‌ విలియమ్స్‌ల పోరుకు రంగ సిద్దమైంది. మూడో రౌండ్‌లోవీరిద్దరూ తలపడబోతున్నారు. యుఎస్ ఓపెన్‌లో వీరిద్దరూ తలపడటం ఇది 30వ సారి కావడం విశేషం. రికార్డు స్థాయిలో 24వ సింగిల్స్‌ గ్రాండ్‌ స్లామ్‌ గెలవాలని ఉవ్విళ్లూరుతున్న సెరెనా విలియమ్స్‌ రెండో రౌండ్లో 6-2, 6-2 తేడాతో జర్మనీ క్రీడాకారిణి కరినా వితాఫ్ట్‌పై విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది.

మరోవైపు ఇటలీ క్రీడాకారిణి కమిలా జియార్జిపై 6-4, 7-5తో విజయం సాధించి వీనస్‌‌ విలియమ్స్ కూడా మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. దీంతో వీరిద్దరూ ప్రత్యర్థులుగా మూడో రౌండ్‌లో తలపడనున్నారు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడటం ఇది 30వ సారి. ఇప్పటి వరకు వీరిద్దరూ 29 సార్లు ప్రత్యర్థులుగా తలపడగా సెరెనా 17 సార్లు, వీనస్‌ 12 సార్లు విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం వీరిద్దరి మధ్య మ్యాచ్‌ జరగనుంది.

Thank you to the incredible @virgilabloh

A post shared by Serena Williams (@serenawilliams) on

Story first published: Thursday, August 30, 2018, 16:26 [IST]
Other articles published on Aug 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X