హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కలిశారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరగడం గమనార్హం.
ఈ భేటీలో జపాన్, ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబు గవర్నర్ నరసింహన్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే, గోదావరి పుష్కరాలకు గవర్నర్‌ను ఆయన ఆహ్వానించారు. ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8, ఓటుకు నోటు కేసు తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చిందా అనే అంశం తెలియాల్సి ఉంది.

సానియా మీర్జాకు చంద్రబాబు అభినందన
వింబుల్డన్ మహిళల డబుల్స్ విజేత, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. సానియా విజయం భారత దేశానికి గర్వకారణమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.