Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను కీళ్లవాతం జబ్బు బారిన పడ్డా: వోజ్నియాకి సంచలనం

Caroline Wozniacki shocked by rheumatoid arthritis diagnosis

హైదరాబాద్: వరల్డ్ టెన్నిస్ మూడో ర్యాంకర్, డెన్మార్క్ స్టార్ ప్లేయర్ కరోలిన్‌ వోజ్నియాకి రుమటైడ్‌ ఆర్ధరైటిస్(కీళ్లవాతం) అనే జబ్బు బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్న తర్వాత 28 ఏళ్ల కరోలిన్‌ అకస్మాత్తుగా అస్వస్థతకు లోనైంది.

దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు రుమటైడ్‌ ఆర్థరైటిస్‌గా తేల్చారు. ప్రస్తుతం వోజ్నియాకి సింగపూర్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో తలపడుతుంది. టోర్నీలో భాగంగా ఆమె ఉక్రెయిన్‌కు చెందిన ఎలినా సవిత్రిలోనాపై 5-7 7-5 6-3తేడాతో విజయం సాధించింది.

ఈ విజయం అనంతరం మీడియా విలేకరుల సమావేశంలో తనకు ఆర్ధరైటిస్‌ వచ్చిన విషయాన్నివోజ్నియాకి వెల్లడించింది. డాక్టర్లు ఈ విషయం చెప్పగానే తాను షాక్‌కు గురయ్యానని చెప్పింది. ఆశావహ దృక్పథంలో ఆలోచించి... ఈ వ్యాధిబారిన పడిన వారికి స్ఫూర్తిగా నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.

వోజ్నియాకి ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇదే వోజ్నియాకికి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు మహిళల టెన్నిస్ ర్యాంకుల్లో 70 వారాలపాటు అగ్రస్థానంలో నిలిచింది. రుమటైడ్‌ ఆర్థరైటిస్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎందరినో పట్టిపీడిస్తోంది.

Story first published: Saturday, October 27, 2018, 12:53 [IST]
Other articles published on Oct 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+