Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

French Open: ఫైనల్‌లో అల్కారజ్

ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కారజ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నువ్వానేనా అన్నట్లుగా ఆద్యంతం రసవత్తరంగా సాగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఇటలీ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సినర్‌పై అల్కారజ్ 2-6, 6-3, 3-6, 6-4, 6-3తో విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన అల్కారజ్ తన కెరీర్‌లో మూడో టైటిల్‌పై కన్నేశాడు.

21 ఏళ్ల అల్కారజ్ 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అతడు ఓ అరుదైన ఘనత సాధించాడు. మూడు కోర్టులపై టైటిల్‌ ఫైట్‌కు చేరిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 2022లో హార్డ్‌ కోర్ట్ (యూఎస్‌ ఓపెన్‌‌), గతేడాది గ్రాస్‌ కోర్ట్ (వింబుల్డన్‌‌) టైటిళ్లు అందుకున్నాడు.

Carlos Alcaraz Triumphs Over Jannik Sinner to Reach 2024 French Open Final

అయితే తొలి సెట్‌లో అల్కారజ్ వెనుకంజలో నిలిచాడు. రెండో సీడ్ సినర్ ఆది నుంచి దూకుడు ప్రదర్శించి మొదటి సెట్‌లో 4-0తో ఆధిపత్యం చెలాయించాడు. ఆ తర్వాత అల్కారజ్ ప్రతిఘటించి సెట్‌ను 2-6తో కోల్పోయాడు. అదే పోరాట పటిమను కొనసాగిస్తూ రెండో సెట్‌ను గెలిచాడు. కానీ మూడో సెట్‌లో సినర్‌పై చేయి సాధిచంచడంతో పోరు రసవత్తరంగా సాగింది. కాగా, అల్కారజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా చివరి రెండు సెట్‌లలో పైచేయి సాధించి సెమీస్ నెగ్గాడు.

ఇవాళ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్
ఫ్రెంచ్ ఓపెన్‌లో నేడు మహిళల సింగిల్స్ తుదిపోరు జరగనుంది. సాయంత్ర 6 గంటలకు ప్రారంభమయ్యే టైటిల్ పోరులో ఇగా స్వైటెక్-జాస్మిన్ పౌలీని తలపడనున్నారు. స్వైటెక్‌కు ఇప్పటికే మూడు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. 2020, 2022, 2023లో టైటిల్ నెగ్గింది. గత రెండు సార్లు వరుసగా గెలిచిన స్వైటెక్ హ్యాట్రిక్‌పై కన్నేసింది. మరోవైపు పౌలీని తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

Story first published: Saturday, June 8, 2024, 8:08 [IST]
Other articles published on Jun 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+