వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కారజ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. యుగో హంబర్ట్‌పై 6-3, 6-4, 1-6, 7-5తో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఇటలీ ఆటగాడు, టాప్ సీడ్ జానిక్ సిన్నర్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. అమెరికా ప్లేయర్, 14వ సీడ్ బెన్ షెల్టన్‌పై 6-2, 6-4, 7-6(9)తో గెలిచాడు.
అయితే అల్కారజ్-హంబర్ట్ పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి రెండు సెట్లలో అల్కారజ్ ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. హంబర్ట్ సర్వీస్‌లు బ్రేక్ చేస్తూ హోరెత్తించాడు. కానీ మూడో సెట్‌లో అనూహ్యంగా తడబడ్డాడు. కుర్రాడు హంబర్ట్ చెలరేగి గొప్పగా ప్రతిఘటించాడు. మూడో సెట్ గెలిచి పోటీలో తిరిగొచ్చాడు. ఇక నాలుగో సెట్ హోరాహోరీగా సాగింది. ఇది కూడా హంబర్ట్ గెలిచి మ్యాచ్ నిర్ణయాత్మక అయిదో సెట్‌కు తీసుకెళ్తాడనిపించింది. కానీ అల్కారజ్ ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. నాలుగో సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను ముగించాడు.

మరోవైపు 5వ సీడ్ మెద్వెదెవ్ క్వార్టర్స్‌కు చేరాడు. ప్రత్యర్థి 10వ సీడ్ దిమిత్రోవ్ వాకోవర్ ఇవ్వడంతో మెద్వెద్వెవ్ తర్వాత రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఇక ఏడుసార్లు ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు. ఆస్ట్రేలియా యువ ఆటగాడు అలెక్సి పాపిరిన్‌ను 4-6, 6-3, 6-4, 7-6 (3)తో ఓడించాడు.ప్రీక్వార్టర్స్‌లో 15వ సీడ్ హోల్గర్ రూన్‌తో జకోవిచ్ పోటీపడనున్నాడు.
మహిళల సింగిల్స్‌లో ఇటలీ అమ్మాయి జాస్మైన్ పాలిని క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్ గాయంతో వైదొలగడంతో జాస్మైన్ క్వార్టర్స్‌కు చేరింది. 6-3, 6-7 (6-8), 5-5తో ఉన్నదశలో కీస్ మ్యాచ్ నుంచి తప్పుకుంది.