Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీ వల్లే లాకర్‌ రూమ్‌లో కాలుజారి పడ్డా: పరిహారం ఇవ్వాలని కోర్టులో బౌచర్డ్ దావా

Bouchard recalls locker room fall in lawsuit testimony

హైదరాబాద్: యుజిని బౌచర్డ్... అంతర్జాతీయ టెన్నిస్‌లో మెరుపులా వచ్చిన యువ టెన్నిస్ ప్లేయర్. 2014 ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో చోటు దక్కించుకుంది. దీంతో టెన్నిస్ అభిమానులు అందరూ ఆమెను భవిష్యత్తు తారగా అభివర్ణించారు. అయితే ఆ తర్వాత అలా జరగలేదు. బౌచర్డ్‌ కెరీర్‌ గాడి తప్పింది.

ర్యాంకింగ్స్‌లో ఏకంగా 116వ స్థానానికి పడిపోయింది. అయితే తాను ఈ పరిస్థితికి చేరడానికి కారణం అమెరికా టెన్నిస్‌ సంఘం (యుఎస్‌టీఏ) అని ఆరోపిస్తుంది. 2015 యుఎస్‌ ఓపెన్‌ సందర్భంగా లాకర్‌ రూమ్‌లో కాలుజారి పడడంతో గాయపడ్డానని, అది తన కెరీర్‌ను దెబ్బతీసిందని ఆరోపిస్తోంది.

అంతేకాదు తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యుఎస్‌టీఏ)పై బ్రూక్లిన్‌లోని డిస్ట్రిక్ కోర్టులో దావా వేసింది. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో 2015లో యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యుఎస్‌టీఏ) గ్లాండ్ స్లామ్ టోర్నీని నిర్వహించింది.

ఆ టోర్నీలో లాకర్ రూమ్‌లో తాను కాలు జారి కింద పడటంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడానని విచారణ సందర్భంగా బౌచర్డ్‌ కోర్టులో చెప్పింది. 'బాగా జారేలా, ప్రమాదకరంగా ఉన్న శుభ్రపరిచే పదార్థాలు వాడడం వల్లే నేను జారిపడ్డాను' అని బౌచర్డ్‌ తన దావాలో పేర్కొంది.

జారి కిందపడటం వల్ల తల నేలకు బలంగా గుద్దుకుందని, మెదడు అదరడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. బౌచర్డ్‌ ఆలస్యంగా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో ఆడి వచ్చిందని, రాత్రి 11 గంటల సమయంలో గదిని శుభ్రం చేస్తారన్న విషయం ఆమెకు తెలిసే ఉంటుందని యుఎస్‌టీఏ తెలపడం విశేషం.

దీంతో రాత్రి 11 గంటల వరకే లాకర్‌ రూమ్‌ను వాడుకోవాలని టోర్నీ హ్యాండ్‌బుక్‌లో ఎక్కడ లేదని బౌచర్డ్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. జారిపడడం వల్ల అయిన గాయంతో బౌచర్డ్‌ కెరీర్‌ దెబ్బతిందని, ఆమె ర్యాంకింగ్స్‌లో కూడా ఆమె స్థానం దిగజారిందని తెలిపారు. ఆ గాయం నుంచి కోలుకున్నా బౌచర్డ్‌ ఫామ్‌ అందుకోలేకపోయిందని కోర్టుకు తెలిపారు.

Story first published: Friday, February 23, 2018, 12:38 [IST]
Other articles published on Feb 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+