For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్‌: ముగిసిన భారత్ పోరు, బోపన్న-శరణ్‌ల జోడి ఓటమి

By Nageshwara Rao
Bopanna, Sharan lose in men's doubles at Australian Open

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌ల జోడీ ఓడిపోయింది. మెల్‌బోర్న్ పార్క్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఎడ్వర్డ్ రోజర్-వెస్లిన్‌ల జోడీ చేతిలో 4-6, 7-6, 3-6 తేడాతో ఓటమి పాలయ్యారు.

సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ పోరులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు అత్యుత్తమ ఆటతీరుని కనబర్చారు. భారత్‌కు చెందిన రోహన్ బోపన్న-దివిజ్ శరణ్‌ల రెండు బ్రేక్ పాయింట్లలో ఒక దానిని పాయింట్‌గా మార్చగా, ప్రాన్స్‌కు చెందిన ఎడ్వర్డ్ రోజర్-వెస్లిన్‌ల జోడీ 12 బ్రేక్ పాయింట్లలో మూడింటిని పాయింట్లుగా మలుచుకుంది.

కాగా, ఆదివారం పురుషుల డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌ పోరాటం ముగిసిన సంగతి తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో లియాండర్‌ పేస్‌-పూరవ్‌ రాజా 1-6, 2-6తో జువాన్‌ సెబాస్టియన్‌-రాబర్ట్‌ ఫరా (కొలంబియా) చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రెండేసిసార్లు భారత జోడీ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జువాజ్‌ జంట సులభంగా విజయాన్ని సొంతం చేసుకుంది.

Story first published: Monday, January 22, 2018, 15:21 [IST]
Other articles published on Jan 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+