
హైదరాబాద్: భారత ఆటగాళ్లైన రోహన్ బోపన్న, డివిజ్ శరణ్‌లు, లెయండర్ పాస్, పురవ్ రాజాల ఆస్ట్రేలియా ఆటగాళ్లపై సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన ఈ సమరంలో అద్వితీయ ప్రదర్శన ఇచ్చి టైటిల్ సమరానికి ఓ ముందడగు వేశారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా పురుషుల డబుల్స్‌లో బోపన్న, శరణ్‌ల జోడీ, లెయండర్ పాస్, పురవ్ రాజాల జోడీ తమ తమ ప్రత్యర్థి జట్టులతో పోరాడి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
పాస్, రాజాల జోడీ నికొలజ్ బసిలాశ్వలి, ఆండ్రిస్ హైదర్ జోడీపై పోరాడి 6-2, 6-3తో విజయాన్నిపొందింది. రెండు జట్ల విజయంతో భారత్‌కు గురువారం ఓ 'సూపర్ డే' గా నిలిచింది.
రోహన్ బోపన్న, రోజర్ వాస్లీన్‌ల జోడీ మొదటి రౌండ్‌లో పరాజయం పొందినా రెండో రౌండ్‌లో అధిక స్కోరును సంపాదించి ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించింది. మొదటి రౌండ్‌లో 6-2తేడాతో ఓడినా రెండో రౌండ్‌కు 7-6 పాయింట్లతో గెలిచింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.