Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం: వీనస్ విలియమ్స్ ఔట్

Belinda Bencic sends Venus Williams crashing out of the Australian Open

హైదరాబాద్: 2018లో తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. ఏడు సార్లు గ్రాండ్ స్లామ్ విజేత, గతేడాది ఫైనలిస్ట్ వీనస్ విలియమ్స్‌ను స్విస్ టెన్నిస్ స్టార్ బెలిందా బెన్సిక్ సునాయాసంగా ఓడించింది.

టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెలిందా చేతిలో వీనస్ 6-3, 7-5 తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. 1997 తర్వాత అంటే సరిగ్గా 21 ఏళ్ల తర్వాత విలియమ్స్ సిస్టర్స్ లేకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ పోటీలు జరుగుతుండటం ఇదే తొలిసారి.

గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను విజేతగా నిలిచిన సెరెనా విలియమ్స్ ఆ తర్వాత తాను గర్భవతిని అని ఆటకు విరామం ప్రకటించడం... సెప్టెంబర్ 1న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కూడా మొదట్లో తాను అందుబాటులో ఉంటానని చెప్పిన సెరెనా ఆ తర్వాత టోర్నీ నుంచి తప్పుకుంది.

ఇదిలా ఉంటే విలియన్స్ సిస్టర్స్ ఆటను చూస్తూ పెరిగిన బెలిందా... వీనస్‌ను ఓడించడం ఓ గొప్ప అనుభూతిగా అభివర్ణించింది. 'నేను ఎంతో మంది ఆటను చూశాను. ఎన్నో గ్రాండ్ స్లామ్‌లు గెలిచి గేమ్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. విలియమ్స్ సిస్టర్స్ ఛాంపియన్లు' అని పేర్కొంది.

'నిజంగా ఇది నాకు ఓ గొప్ప అనుభూతి. వారితో కలిసి ఆడే అవకాశం రావడం వస్తుందని అనుకోలేదు' అని బెలిందా తెలిపింది. మరోవైపు మ్యాచ్ అనంతరం వీనస్ మాట్లాడుతూ 'తాను బాగా ఆడటం లేదని అనుకోవడం లేదని, బెలిందా తనకన్నా బాగా ఆడింది' అని వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే గతేడాది హోప్‌మన్ కప్‌లో రోజర్ ఫెదరర్‌తో కలసి ట్రోఫీని అందుకోవడంతో బెలిందా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగి పోయింది.

Story first published: Tuesday, January 16, 2018, 16:37 [IST]
Other articles published on Jan 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+