న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open:52వ ప్రయత్నంలో పవ్లిచెంకోవా సక్సెస్..క్రెజికోవాతో టైటిల్‌ ఫైట్‌!

Barbora Krejcikova faces Anastasia Pavlyuchenkova in French Open 2021 final

పారిస్: 52 సార్లు మేజర్‌ టోర్నీల్లో బరిలోకి దిగిన రష్యా సుందరి అనస్తాసియా పవ్లిచెంకోవా తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2021 ఫైనల్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఇక తాను కూడా ఏమాత్రం తక్కువా అన్నట్లు చెక్‌ ప్లేయర్ బార్బొరా క్రెజికోవా మట్టికోర్టులో తుది సమరానికి దూసుకొచ్చింది. అంచనాలకు అందకుండా సాగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల తుది పోరుకు సిద్ధమైన ఇద్దరు అనామక క్రీడాకారిణులు టైటిల్‌ ఫైట్‌ కోసం ఆతృతగా ఉన్నారు. శనివారం జరిగే టైటిల్‌ పోరులో వీరిద్దరిలో ఎవరు గెలిచినా సరికొత్త గ్రాండ్‌ స్లామ్‌ విన్నర్‌గా నిలుస్తారు. ఫైనల్‌ కాని ఫైనల్‌లో తలపడేందుకు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌, సెర్బియా స్టార్ నొవాక్‌ జొకోవిచ్‌ సన్నద్ధమవుతున్నారు.

గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో పవ్లిచెంకోవా 7-5, 6-3తో స్లొవేనియా కెరటం టమారా జిదాన్‌సెక్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో మాత్రమే ప్రత్యర్థి నుంచి పవ్లిచెంకోవాకు పోటీ ఎదురైంది. తొలి సెట్లో 2-0 ఆధిక్యంలో నిలిచిన జిదాన్‌సెక్‌.. ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టింది. వెంటనే పుంజుకున్న పవ్లించెకోవా.. 2-2తో స్కోరు సమం చేసింది. అక్కడ నుంచి ఇద్దరూ రసవత్తరంగా పోరాడారు. దీంతో సెట్‌ టైబ్రేకర్‌ వెళ్తుందేమో అనిపించింది. కానీ పన్నెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన పవ్లిచెంకోవా.. సెట్‌ను గెలిచింది. రెండో సెట్లో ఆరంభంలోనే జిదాన్‌సెక్‌ సర్వీస్‌ను పవ్లిచెంకోవా బ్రేక్‌ చేసింది. ఆ తర్వాత 4-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అదే జోరు ప్రదర్శించి 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది.

టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. సకారియా, పడిక్కల్‌కు అవకాశం! శ్రీలంక టూర్‌కు భారత జట్టు ఇదే!టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. సకారియా, పడిక్కల్‌కు అవకాశం! శ్రీలంక టూర్‌కు భారత జట్టు ఇదే!

50 అంతకంటే ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు ఆడిన తర్వాత మొదటిసారి ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా 29 ఏళ్ల పవ్లిచెంకోవా రికార్డు సృష్టించింది. ఆమెకిది 52వ గ్రాండ్‌స్లామ్‌. తొలిసారి 2007లో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (వింబుల్డన్‌)లో బరిలోకి దిగింది. పవ్లిచెంకోవా టైటిల్‌ కోసం బార్బరా క్రెజికోవా (చెక్‌)తో తలపడుతుంది. మూడు గంటలకుపైగా హోరాహోరీగా సాగిన మరో సెమీఫైనల్లో క్రెజికోవా 7-5, 4-6, 9-7తో మరియా సకారి (గ్రీస్‌)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో అయిదు ఏస్‌లు కొట్టిన క్రెజికోవా.. ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసింది. క్రెజికోవాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. తాజా విజయం సంతోషాన్నివ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేసిందని సెమీస్‌ అనంతరం చెప్పిన పవ్ల్యూచెంకోవా.. ఫైనల్‌లో శక్తివంచన లేకుండా పోరాడుతానని పేర్కొంది.

ఫ్రెంచ్‌ ఓపెన్లో ఫైనల్‌కు ముందే ఫైనల్‌ జరగనుంది. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ సిద్ధమయ్యాడు. క్వార్టర్‌ఫైనల్లో తొమ్మిదో సీడ్‌ బెరిటిని (ఇటలీ)పై 6-3, 6-2, 6-7 (5/7), 7-5తో విజయాన్ని అందుకున్న జకో.. రఫాతో సమరానికి సై అంటున్నాడు. బెరిటినిపై జకో అంత సులభంగా ఏమీ గెలవలేదు. తొలి రెండు సెట్లు పెద్దగా కష్టపడకుండానే నెగ్గిన నొవాక్‌కు.. మూడు, నాలుగు సెట్లలో బెరిటిని గట్టిపోటీ ఇచ్చాడు. బెరిటిని ఎక్కడా తగ్గకపోవడంతో నొవాక్‌ ప్రతి పాయింటుకూ చెమటోడ్చాల్సి వచ్చింది. 51 అనవసర తప్పిదాలు చేసి ఓటమి కొనితెచ్చుకున్నాడు.

ఫైనల్‌లో స్థానం దక్కించుకోవాలంటే జకోవిచ్‌ పెద్ద అడ్డంకినే అధిగమించాలి. సెమీస్‌లో జకోవిచ్‌ 13సార్లు ఛాంపియన్‌ నాదల్‌ను ఢీకొంటాడు. రికార్డు పరంగా చూస్తే.. క్లే కోర్టుల్లో నొవాక్‌పై రఫాదే ఆధిపత్యం. మట్టి కోర్టుల్లో ఇప్పటివరకు ఈ ఇద్దరు 26సార్లు తలపడగా.. అందులో నాదల్‌ 19 సార్లు పైచేయి సాధించాడు. రొలాండ్‌ గారోస్‌లో ఇద్దరూ ఎనిమిదిసార్లు ఆడితే.. నాదల్‌ (7) తిరుగులేని ఆధిక్యంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే జకోవిచ్‌ 29-28తో రఫాపై ఒక్క విజయంతో పైచేయిలొ ఉన్నాడు. గాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఇద్దరూ 16 సార్లు ఎదురుపడగా.. నొవాక్‌ (6)పై నాదల్‌ (10) ముందంజలో ఉన్నాడు.

Story first published: Friday, June 11, 2021, 8:35 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X