అదడిగితే జ్వాలా గుర్రు: ఇది అడిగితే అజర్‌కు కోపం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్‌తో అఫైర్ గురించి అడిగిన మీడియా ప్రతినిధులపై టెన్నిస్ స్టార్ జ్వాలా గుత్తా తోక తొక్కిన పాముుల బుసకొట్టారు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి అడిగితే అజరుద్దీన్ ఆగ్రహంగా లేచిపోయారు.
అజరుద్దీన్ క్రికెట్ క్రీడలో అద్భుతాలు సృష్టించారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఆయన విజయాలపై నీలి నీడలు పరిచాయి. హైదరాబాదీ ఆటగాడు అజరుద్దీన్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన 'అజర్' సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.
నటీనటులతో కలిసి అజరుద్దీన్ కూడా ప్రమోషన్‌లో పాలుపంచుకుంటున్నాడు. అయితే ప్రచారంలో భాగంగా ఓ చానెల్ ఇంటర్వ్యూ అజర్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అజర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ ఫిక్సింగ్‌పై చానెల్ ప్రశ్నలు సంధిస్తూ వచ్చింది.

డబ్బు తీసుకున్నారా? లేదా? అని సూటిగా అడగడంతో ఆయనగారి కోపం నషాళానికి అంటింది. అజర్ సమాధానం చెప్పలేక కోపంతో అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్లిపోయాడు. స్టేజ్‌పైకి రావాలని సినిమా యూనిట్ కోరినా దూరంగానే ఉన్నాడు.
ఎక్కడికి వెళ్లినా ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయని భావించి మరోచోటికి వెళ్లినా కూ డా ప్రమోషన్‌లో పాలుపంచుకోలేదని సినిమా వర్గాలు తెలిపాయి. కాగా అజర్ 99 టెస్టుల్లో 6215, 334 వన్డేల్లో 9378 పరుగులు సాధించాడు. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా అజర్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2012లో ఆ నిషేధాన్ని కొట్టివేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications