Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొడుకుతో కలసి ప్రయాణించలేక ఆగిపోయిన అజరెంకా

Azarenka the latest star to withdraw from Australian Open

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్‌లో మరో క్రీడాకారిణి చర్చనీయాంశమైంది. ఇప్పటికే రెండు సార్లు టైటిల్‌ను గెలుచుకున్న అజరెంకా ప్రస్తుతం జరగనున్న గ్రాండ్ స్లామ్ ఓపెనింగ్ నుంచి తప్పుకుంది.

జనవరి 8 నుంచి మ్యాచ్‌కు హాజరుకాకపోవడంతో అజరెంకా పాల్గొనదు అనే వార్తను అధికారికంగా నిర్వహక సంఘం ధృవీకరించింది. ఈమె కంటే ఆధిక్యంలో ఉన్న సెరెనా విలియమ్స్, ఐదు సార్లు రన్నర్‌గా నిలిచిన ఆండీ ముర్రే, కీ నిషికొరి‌లతో పాటుగా అజరెంకా కూడా తప్పుకుంది.

ప్రపంచ మాజీ నెంబరు వన్ 28ఏళ్ల అజరెంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిసెంబరులో ప్రవేశించింది. కానీ, తన కొడుకుతో కలిసి మెల్‌బోర్న్ పర్యటనకు వెళ్లలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోలేక తప్పలేదు.

బెలారష్యన్ అజరెంకా 2012, 2013లలో వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచారు. 2017సంవత్సరంలో కేవలం ఆరు ప్రదర్శనలిచ్చి నాలుగు విజయాలను సొంతం చేసుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 14:35 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+