ఫెదరర్ నిష్క్రమణ: ప్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన రఫెల్ నాదల్

హైదరాబాద్: ప్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రఫ్పాడించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో స్విస్‌ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై 6-3,6-4, 6-2 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తాజా విజయంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇప్పటివరకు రఫెల్ నాదల్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ని కూడా ఓడిపోలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను రఫెల్ నాదల్‌ అవలీలగా గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో మొదట ఫెదరర్ ఆధిక్యంలో నిలిచినప్పటికీ, ఆ తర్వాత రఫెల్ నాదల్ దెబ్బకు వెనుకబడిపోయాడు. చివరకు నాదల్‌దే పైచేయి అయింది. ఇక, మూడో సెట్‌ ఏకపక్షంగా సాగింది. నాదల్‌ దూకుడుగా ఆడి వరుస పాయింట్లు సాధించడంతో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

ఈ పోరులో ఫెడరర్‌ మూడు ఏస్‌లు సంధించగా, నాదల్‌ మూడు ఏస్‌లే సంధించాడు. ఇక డబుల్‌ ఫాల్ట్‌ విషయానికొస్తే చెరో తప్పిదం చేశారు. ఇక, నాదల్‌ ఆరు బ్రేక్‌ పాయింట్లను సాధించగా, ఫెదరర్‌ రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. మొత్తంగా నాదల్‌ 102 పాయింట్లను సాధించగా... ఫెదరర్ 79 పాయింట్లను గెలిచాడు. ఇక, నాదల్ 58 సర్వీస్‌ పాయింట్లు గెలవగా, 49 సర్వీస్‌ పాయింట్లు సాధించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 7, 2019, 21:16 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X