జకోవిచ్‌కు షాక్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం
హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనం నమోదైంది. పురుషుల డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ 2 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్‌లోనే అనూహ్యంగా నిష్క్రమించాడు. గురువారం దాదాపు ఐదు గంటలపాటు హోరాహోరీగాసాగిన రెండో రౌండ్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 117వ ర్యాంకు ఆటగాడు డెనిస్ ఇస్తోమిన్ చేతిలో 6-7, 7-5, 6-2, 6-7, 4-6 తేడాతో ఓడిపోయాడు.
వీరిద్దరి మధ్య హోరాహోరీగా పోరు 4 గంటల 48 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది. మేజర్ టోర్నీలో క్వార్టర్స్ కూడా చేరని డెనిస్ అద్భుత ప్రదర్శనతో విజృంభించి.. జకోవిచ్‌ను ఎనిమిదేళ్లలో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ రెండోరౌండ్లోనే నిష్క్రమించేలా చేశాడు. దీంతో టాప్‌సీడ్ ముర్రే తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించేందుకు మార్గం సుగమమైంది.
జకోవిచ్ ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఆరంభరౌండ్లలోనే వెనుదిరగడం 2008 వింబుల్డన్ తర్వాత ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఆరు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన జొకోవిచ్‌కు ఈ ఓటమి నిజంగా పెద్ద షాక్ అని చెప్పాలి. అంతేకాదు జకోవిచ్ ఈసారి టైటిల్ గెలిస్తే.. అత్యధికసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు.

ఇది రెండోసారి
గత ఏడేళ్లలో వందో ర్యాంక్ పైనున్న ప్లేయర్స్ చేతిలో జకోవిచ్ ఓటమిపాలవడం ఇది రెండోసారి మాత్రమే. గతేడాది రియో ఒలింపిక్స్‌లో 145వ ర్యాంకర్ డెల్‌పొట్రొ చేతిలో జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. జకోవిచ్ ఓటమితో టాప్‌సీడ్ ముర్రే టైటిల్ ఆశలు రెట్టింపయ్యాయి.

నాలుగుసార్లు జకోవిచే ప్రత్యర్థి కావడం విశేషం
ఈ వేదికపై తొలి టైటిల్‌కోసం ఎదురుచూస్తున్న ప్రపంచ నంబర్‌వన్ ముర్రే ఇక్కడ ఏడేళ్లలో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిస్తే, నాలుగుసార్లు జకోవిచే ప్రత్యర్థి కావడం విశేషం. ప్రస్తుతం అతడు ఆరు టైటిళ్లతో రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా)తో సమంగా ఉన్నాడు. ఇక ఇస్టోమిన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరడం ఇదే తొలిసారి.

మూడో రౌండ్లో అడుగుపెట్టిన నాదల్, రోనిచ్
ఇక మాజీ నెంబర్‌వన్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ రోనిచ్ (కెనడా), దిమిత్రోవ్ (బల్గేరియా) మూడో రౌండ్లో అడుగుపెట్టారు. రెండో రౌండ్లో నాదల్ 6-3, 6-1, 6-3తో బగ్దాటిస్ (సైప్రస్)పై గెలిచాడు. రోనిచ్ 6-3, 6-4, 7-6 (7-4)తో ముల్లర్ (లక్సెంబర్గ్)పై నెగ్గగా.. దిమిత్రోవ్ 1-6, 6-4, 6-4, 6-4తో చుంగ్ (కొరియా)ను ఓడించాడు.

మూడో రౌండ్లో సెరెనా విలియమ్స్
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), ఆరో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) మూడో రౌండ్లో ప్రవేశించారు. సెరెనా విలియమ్స్ 6-3, 6-4తో సఫరోవా (చెక్)పై, సిబుల్కోవా (6-4), 7-6 (10-8)తో సీహ్ (తైపీ)పై గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications