Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్‌: ఈజీ విజయం, రెండో రౌండ్లోకి సెరెనా

హైదరాబాద్: ఆరుసార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన అమెరికా టెన్నిస్‌ ఏస్‌ సెరెనా విలియ‌మ్స్ సునాయాస విజయంతో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్‌ బెలిండా బెన్సిక్‌ (స్విస్‌)ను సునాయాసంగా గెలుపొందింది. బెన్సిక్‌ను 6-4, 6-3తో వరుస గేముల్లో చిత్తుగా ఓడించింది.

79 నిమిషాల్లోనే మ్యాచ్‌ని ముగించిన సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిస్తే తన కెరీర్‌లోనే రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంటుంది. సెరెనా త‌న రెండో రౌండ్‌లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన లూసీ స‌ఫ‌రోవాను ఎదుర్కొనుంది. గతేడాది ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైన‌ల్లో సెరెనా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఫైనల్‌లో జ‌ర్మ‌నీకి చెందిన కెర్బ‌ర్ చేతిలో సెరీనా ఓడింది. ఇదిలా ఉంటే రైజింగ్‌ స్టార్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌) ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెరుపు విజయం సాధించింది. తొలి రౌండ్లో 106వ ర్యాంకు సారా సోర్రిబీస్‌ టోర్మో (స్పెయిన్‌)ను 6-2, 6-0తో ఓడించింది.

Australian Open: Serena Williams progresses into second round with an easy win

మరోవైపు ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌, స్పెయిన్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ సత్తా చాటాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో విజయం సాధించాడు. 14 గ్రాండ్‌‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న నాదల్‌ మంగళవారం ఫ్లోరియాన్‌ మేయర్‌ (జర్మనీ)ను 6-3, 6-4, 6-4తో వరుస సెట్లలో చిత్తు చేశాడు.

నాదల్ రెండో రౌండ్‌లో బాగ్దాటిస్‌తో తలపడనున్నాడు. ఇక పురుషుల సింగిల్స్‌లో తొలిరౌండ్లో ఫెదరర్ 7-5, 3-6, 6-2, 6-2తో ఆస్ట్రియా ఆటగాడు జుర్గెన్ మెల్జర్‌పై గెలుపొంది అమెరికా క్వాలిఫయర్ నా రుబిన్‌తో రెండోరౌండ్‌కు సిద్ధమయ్యాడు.

తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ప్రపంచ నెంబర్ వన్ ఆండీ ముర్రే 7-5, 7-6(5), 6-2తో ఉక్రెయిన్‌కు చెందిన ఇల్యా మార్చెన్‌కోపై అతికష్టమ్మీద గెలిచి రెండోరౌండ్‌కు చేరాడు. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన హోరాహోరీ పోరులో మాజీ చాంపియన్ స్టానిస్లాస్ వారింకా 4-6, 6-4, 7-5, 4-6, 6-4తో మార్టిన్ క్లిజాన్‌పై విజయం సాధించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+