For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్: 9వసారి, ఫైనల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్

ఆస్ట్రేలియన్ ఓపెన్ పైనల్స్‌లో మెరికాకు చెందిన అక్కాచెల్లెళ్లు వీన‌స్‌, సెరీనా విలియ‌మ్స్ తలపడనున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో వారిద్దరూ తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ఫైనల్లోకి ప

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ పైనల్స్‌లో మెరికాకు చెందిన అక్కాచెల్లెళ్లు వీన‌స్‌, సెరీనా విలియ‌మ్స్ తలపడనున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో వారిద్దరూ తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించారు. సెరెనా విలియమ్స్ 6-2, 6-1 తేడాతో లూసిచ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

Australian Open: Serena Williams to face sister Venus in finals

కేవలం 50 నిమిషాల్లో సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి లూసిచ్‌పై సునాయాసంగా గెలుపొందింది. మరోవైపు వీనస్ విలియమ్స్ 6-7(3/7), 6-2, 6-3 తేడాతో మరో అమెరికా క్రీడాకారిణి కోకో వాండెవేపై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. వీనస్ మాత్రం తన ప్రత్యర్ధిపై పోరాడి గెలిచింది.

తొలి సెట్‌ను టై బ్రేక్‌లో వీనస్ కోల్పోయినా, ఆ తరువాత రెండు సెట్లను సొంతం చేసుకుని ఫైనల్‌కు అర్హత సాధించింది. వీరిద్దరూ గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌డం ఇది తొమ్మిద‌వ సారి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనా ఫైనల్‌కు చేరడంతో ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.

Australian Open: Serena Williams to face sister Venus in finals

శనివారం జరిగే పైనల్స్‌లో సెరెనా విలియమ్స్ గెలిస్తే ఓపెన్ చరిత్రలోనే జర్మనీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ సాధించిన అత్యధిక టైటిల్స్ రికార్డును అధిగమిస్తుంది. ప్రస్తుతం స్టెఫీ గ్రాఫ్-సెరెనాలు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి సమానంగా ఉన్నారు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్ ను సాధించిన సెరెనా.. యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌లో నిష్క్రమించి ఆ రికార్డును మిస్సయ్యింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+