
హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచనలం నమోదైంది. ఓ పాపకు జన్మనిచ్చినా.. తనలో చేవ తగ్గలేదని నిరూపిస్తూ అమెరికా టెన్నిస్ స్టార్ రికార్డు గ్రాండ్‌స్లామ్ వేటలో దిగ్విజయంగా దూసుకుపోతోంది.
సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ 6-1, 4-6, 6-4 స్కోర్ తేడాతో వరల్డ్ నంబర్ వన్ సిమోనా హలెప్‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్‌లోకి వెళ్లింది. 37 ఏళ్ల సెరీనా మొదటి సెట్‌ను కేవలం 20 నిమిషాల్లోనే కైవసం చేసుకోవడం విశేషం.
ఆ తర్వాత రెండో సెట్‌ను హలెప్ సొంతం చేసుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడవ సెట్ హోరాహోరీగా సాగింది. ఒకానొక దశలో 3-3తో సమానంగా ఉన్న సమయంలో.. సెరీనా విలియమ్స్ మూడు బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది.
మొత్తం గంటా 47 నిమిషాల్లో సెరీనా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తన కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న అమెరికా తార సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో అడుగు ముందుకేసింది.
ఇప్పటికే ఏడు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సెరెనా విలియన్స్ మొత్తంగా తన ఖాతాలో 24వ గ్రాండ్ స్లామ్‌ను వేసుకోవాలని చూస్తోంది. ఈ ఏడాది సెరెనా గనుక ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గితే, ఆల్‌టైమ్ గ్రేట్ మార్గరేట్ కోర్ట్‌ను సమం చేసినట్లు అవుతుంది.