For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్: బోపన్నకు షాకిచ్చిన సానియా మిర్జా

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో హోరాహోరీగా సాగిన పోరులో సానియా, ఇవాన్‌ దొడిగ్‌(క్రొయేషియా) జంట 6-4, 3-6, 12-10తో రోహన్‌ బోపన్న(భారత్‌), దబ్రోవ్‌స్కి(కెనడా) జోడీపై విజయం స

By Nageshwara Rao

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా జంట ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సత్తా చాటుతోంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో హోరాహోరీగా సాగిన పోరులో సానియా, ఇవాన్‌ దొడిగ్‌(క్రొయేషియా) జంట 6-4, 3-6, 12-10తో రోహన్‌ బోపన్న(భారత్‌), దబ్రోవ్‌స్కి(కెనడా) జోడీపై విజయం సాధించింది.

రెండో సీడెడ్‌గా బరిలోకి దిగిన సానియా జోడీకి బోపన్న జోడీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ సెమీ ఫైనల్లో ప్రవేశించింది. తద్వారా ఈ సీజన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సానియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Australian Open: Sania Mirza edges past compatriot Rohan Bopanna inmixed doubles to enter semis

67 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ చేతిలో బోపన్న జోడీ ఓటమి పాలవ్వడంతో అస్ట్రేలియాన్ ఓపెన్‌లో బోపన్న పోరాటం ముగిసింది. మరో క్వార్టర్స్‌లో భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌, మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జోడి సమంత స్టోసర్‌, సామ్‌ గ్రోత్‌లతో తలపడనుంది.

ఈ పోరులో విజయం సాధించిన జోడీతో సెమీస్‌లో సానియా జోడీ తలపడనుంది. ఇదిలా ఉంటే జీల్ దేశాయ్ తన ప్రత్యర్ధి ఐదో సీడ్ సెర్బియా ఓల్గాపై విజయం సాధించి జూనియర్ గర్ల్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+