ఆస్ట్రేలియన్ ఓపెన్: మూడో రౌండ్‌లోకి సానియా, బోపన్న ఔట్
హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో విభాగంలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సానియా మీర్జా- చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రికోవా జోడీ మూడో రౌండ్లోకి ప్రవేశించింది.
రెండో రౌండ్‌లో ఈ జంట 6-1,6-4 తేడాతో సమంతా స్టుసుర్(ఆస్ట్రేలియా)-షాయ్ జంగ్ (చైనా)పై గెలిచి మూడో రౌండ్ లోకి అడుగుపెట్టింది. గంటా 21 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వరుస రెండు సెట్లను సానియా జోడి కైవసం చేసుకుని విజయాన్నిసొంతం చేసుకుంది.

మరోవైపు ఇదే టోర్నీలో రోహన్ బోపన్న ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ లో అలెక్స్ బోల్ట్- బ్రాడ్ లీ మోస్ లీల జోడి 2-6, 7-6(2), 6-4 తేడాతో బోపన్న-పబ్లో క్యూవాస్ జంటను ఓడించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: Australian Open: Sania Mirza advances
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications