ఆస్ట్రేలియన్ ఓపెన్: భారత ఆశలు సజీవం, రెండో రౌండ్లోకి సానియా, బోపన్న
హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ క్రీడాకారులు చక్కటి శుభారంభం చేశారు. బుధవారం తమ భాగస్వాములతో కలిసి సానియా మీర్జా, రోహన్ బోపన్న విజయాలు సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, పాబ్లో క్యూవస్ (ఉరుగ్వే) జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో థామస్ బెల్లూసీ (బ్రెజిల్), మాక్సిమో గొంజాలెజ్ (అర్జెంటీనా) జోడీని 6-4, 7-6(4) తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.

పురవ్‌రాజా, దివిజ్ శరణ్ జోడీ తొలి రౌండ్లో ఫ్రెంచ్ జోడీ జొనాథన్ ఎస్సెరిక్, ఫాబ్రిస్ మార్టిన్‌తో, లియాండర్ పేస్, ఆండ్రూ సా జోడీ ట్రీట్ హుయె, మాక్స్ మిర్నీ జోడీతో తలపడనుంది. ఇక మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా మిర్జా, స్ట్రికోవా (చెక్) జోడీ 6-3, 6-1తో బ్రిటిష్ ద్వయం జాస్లిన్, అన్నా స్మిత్‌ను చిత్తుచేసింది.
సుమారు గంట సేపు జరిగిన తొలి సెట్‌లో బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డ సానియా జోడీ రెండో సెట్లో పూర్తిగా దూకుడుగా ఆడింది. తొలి సెట్‌లో 32 నుంచి 38 వరకు ఈ జోడీ సింగిల్ బ్రేక్ పాయింట్‌ని కూడా ఫేస్ చేయలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications