భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న చరిత్ర సృష్టించాడు. పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా బోపన్న అరుదైన రికార్డు సాధించాడు. 43 ఏళ్ల బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించి ఈ ఘనత అందుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా ఓపెన్ ముగిసిన అనంతరం తాజా ర్యాంక్‌లను అధికారికంగా ప్రకటిస్తారు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెన్స్ డబుల్‌లో మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి రోహన్ బోపన్న బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ అయిన మూడో స్థానంతో ఈ గ్రాండ్ స్లామ్‌లో అడుగుపెట్టాడు. తన భాగస్వామితో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్‌లోనూ ఈ జోడీ అదరగొట్టారు. అర్జెంటీనా జంట మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రూ మోల్టెనిపై బోపన్న జోడి 6-4, 7-6 వరు సెట్లతో ఆధిపత్యం చెలాయించారు.

46 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ప్రత్యర్థికి బోపన్న జోడీ అవకాశం ఇవ్వకుండా సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ క్రమంలో బోపన్న ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అయితే డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించిన నాలుగో భారత క్రీడాకారుడిగా రోహన్ బోపన్న రికార్డు సాధించాడు. అంతకుముందు భారత్ తరపున లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా ఈ ఘనత సాధించారు.
మరోవైపు సెమీఫైనల్‌కు చేరడంతో మాథ్యూ ఎబ్డెన్ కూడా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుననాడు. రెండో ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. కాగా, గతేడాది బోపన్న జోడీ యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు అర్హత సాధించిన అతిపెద్ద వయస్సు ప్లేయర్‌గా బోపన్న గతంలో రికార్డులకెక్కాడు. ఇప్పుడు తాజాగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించడం విశేషం. గతంలో అత్యధిక వయస్సులో నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న రికార్డు అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ (38 ఏళ్లు) పేరిట ఉంది. బోపన్న టెన్నిస్‌లో అడుగుపెట్టి 20 ఏళ్లు గడిచాయి.