
వెనుకబడ్డ నాదల్
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ రఫెల్ నాదల్, రెండో ర్యాంకర్ మెద్వెదేవ్ తలపడ్డారు. నాదల్ వయసు 35 సంవత్సరాలు కాగా, మెద్వెదెవ్ వయసు 25 సంవత్సరాలు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌ను రష్యా స్టార్ మెద్వెదెవ్ ఘనంగా ప్రారంభించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ తొలి రెండు సెట్లను కైవసం చేసుకున్నాడు.
వరుస సర్వీస్ పాయింట్లు, బ్రేక్ పాయింట్లతో నాదల్‌పై మెద్వెదెవ్ పైచేయి సాధించాడు. తొలి సెట్‌ను 6-2తో సునాయసంగా కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌లో నాదల్ పోటీ ఇచ్చినప్పటికీ టై బ్రేక్‌లో సెట్‌ను మెద్వెదెవే కైవసం చేసుకున్నాడు. 6-7(5-7) తేడాతో రెండో సెట్‌ను గెలుచుకుని మెద్వెదెవ్ మ్యాచ్‌ను కూడా గెలిచేలా కనిపించాడు.

పుంజుకున్న నాదల్
ఇక నిర్ణయాత్మక మూడో సెట్ నుంచి నాదల్ తన అసలు ఆటను ప్రారంభించాడు. తనదైన షాట్లతో మెద్వెదేవ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే మెద్వెదెవ్ కూడా ఏ మాత్రం తగ్గకపోవడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. అయితే చివరి మ్యాచ్ మూడు, నాలుగు సెట్లను నాదల్ 6-4, 6-4 తేడాతో గెలుచుకుని మ్యాచ్‌లోకి వచ్చాడు.
దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చే చివరి సెట్‌లో నాదల్, మెద్వెదేవ్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ఇద్దరు ఫైనల్ మ్యాచ్‌ను వదులుకోవడానికి ఏ మాత్రం ఇష్టకపోవడంతో క్షణ క్షణానికి ఉత్కంఠ పెరగసాగింది. ఓ ర్యాలీ 20 షాట్లపాటు సాగిందంటే వీరిద్దరు ఏ విధంగా పోరాడారో అర్థం చేసుకోవచ్చు.

అనుభవాన్నంతా ఉపయోగించిన నాదల్
చివరి సెట్‌లో తొలుత మెద్వెదెవ్ 2-1తో అధిక్యంలో నిలిచినప్పటికీ పుంజుకున్న నాదల్ 4-2తో అధిక్యంలోకి వచ్చారు. ఈ క్రమంలో మెద్వెదెవ్ మళ్లీ పుంజుకోవడంతో 5-5తో ఇద్దరు సమంగా నిలిచారు. ఈ సమయంలో నాదల్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆడాడు.
మెద్వెదెవ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. కానీ చివర్లో అధిక్యంలోకి వెళ్లిన నాదల్ చివరి సెట్‌ను 7-5తో కైవసం చేసుకుని ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియా ఓపెన్‌ను నాదల్ రెండో సారి గెలిచాడు. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌పై నాదల్ 2-6, 6-7(5-7), 6-4, 6-4, 7-5 తేడాతో విజయం సాధించాడు.

నాదల్ రికార్డులు
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయంతో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా స్పెయిన్‌బుల్ రఫెల్ నాదల్ అవతరించాడు. ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్‌లతో రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌తో సమంగా ఉన్న నాదల్ ఈ విజయంతో 21 గ్రాండ్‌స్లామ్‌లతో వారిని అధిగమించాడు. అయితే ఓవరాల్‌గా మాత్రం నాదల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
అతని కంటే ముందు మహిళా టెన్నిస్ ప్లేయర్లు మార్గెర్ కోర్ట్ (24), సెరెనా విలియమ్స్ (23), స్టెఫీ గ్రాఫ్ (22) ఉన్నారు. అలాగే తొలి రెండు సెట్‌లు ఓడిన తర్వాత కూడా పుంజుని మ్యాచ్ గెలవడం నాదల్‌కు ఇది నాలుగోసారి. కాగా ఈ సందర్భంగా నాదల్‌కు రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్ అభినందనలు తెలిపారు.


Click it and Unblock the Notifications












