ఆస్ట్రేలియన్ ఓపెన్: ఫైనల్‌లోకి నాదల్, సెమీస్‌లో అద్భుత విజయం
హైదరాబాద్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో తొమ్మిదో సీడ్ నాదల్ 4 గంటల 56 నిమిషాల్లో 6-3, 5-7, 7-6 (7/5), 6-7 (4/7), 6-4తో బల్గేరియా ఆటగాడు, 15వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై విజయం సాధించాడు.
ఈ విజయంతో ఆదివారం జరిగే ఫైనల్లో 17వ సీడ్, మాజీ చాంపియన్ రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్)తో నాదల్ తలపడనున్నాడు. కెరీర్‌లో రెండోసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీఫైనల్ ఆడుతున్న దిమిత్రోవ్, నాదల్‌కు అద్భుతమైన పోటీ ఇచ్చాడు. తొలి సెట్‌లో ఒకసారి దిమిత్రోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 6-3తో విజయం సాధించాడు.

రెండో సెట్‌లో తేరుకున్న దిమిత్రోవ్
అయితే రెండో సెట్‌లో తేరుకున్న దిమిత్రోవ్, నాదల్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. 5-5తో ఇద్దరూ సమంగా ఉన్న వేళ దిమిత్రోవ్ చెలరేగి ఆడాడు. రెండు గేమ్‌లు గెలుచుకొని 7-5తో నాదల్‌ను ఓడించాడు. మూడో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను ఒక్కోసారి కోల్పోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది.

ఐదో సెట్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగింది
ఇక టైబ్రేక్‌కు దారితీసిన మూడో సెట్‌ను నాదల్ 7-6 (7/5)తో కైవసం చేసుకొన్నాడు. ఇక నాలుగో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో మళ్లీ టైబ్రేక్ తప్పలేదు. ఈసారి దిమిత్రోవ్ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. ఇక కీలకమైన ఐదో సెట్‌నూ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లే ఆడారు.

తొమ్మిదో గేమ్‌లో నాదల్ పైచేయి
1-1, 2-2, 3-3, 4-4తో సమంగా నిలిచాడు. ఇక్కడే నాదల్ అనూహ్యంగా పుంజుకున్నాడు. అయితే తొమ్మిదో గేమ్‌లో దిమిత్రోవ్ సర్వీస్‌ను నాదల్ బ్రేక్ చేసి 5-4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. తద్వారా కీలకమైన తొమ్మిదో గేమ్‌లో నాదల్ పైచేయి సాధించాడు. పదో గేమ్‌లో నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6-4తో సొంతం చేసుకొని ఫైనల్‌కు అర్హత సాధించాడు.

కెరీర్‌లో నాలుగోసారి ఆస్ట్రేలియా ఫైనల్ చేరుకున్న నాదల్
ఈ మ్యాచ్ మొత్తంలో నాదల్ ఎనిమిది ఏస్‌లు సంధించి, 43 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 29 సార్లు దూసుకొచ్చి 24 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు దిమిత్రోవ్ 20 ఏస్‌లు సంధించినా... ఏకంగా 79 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో తన కెరీర్‌లో నాలుగోసారి ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications