For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్: ఒకరు పూర్వ వైభవం, మరొకరు రికార్డు కోసం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌, మాజీ ప్రపంచ నెంబర్‌ వన్‌ రఫెల్‌ నాదల్ నాలుగో రౌండ్‌లో అలవోక విజయాలతో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎనిమిదో రోజు సీడెడ్ల హవా కొనసాగింది. స్టెఫీ గ్రాఫ్‌ (22) గ్రాండ్‌ స్లామ్స్‌ టైటిళ్ల రికార్డును బ్రేక్‌ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న సెరెనా విలియమ్స్‌, మాజీ ప్రపంచ నెంబర్‌ వన్‌ రఫెల్‌ నాదల్ నాలుగో రౌండ్‌లో అలవోక విజయాలతో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఆరు సార్లు టోర్నీ విజేత, రెండో సీడ్‌ సెరెనా 7-5, 6-4తో వరుస సెట్లలో 16వ సీడ్‌ బార్బరా స్ర్టికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. ఇక, పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్‌ రఫెల్ నాదల్ 6-3, 6-3, 4-6, 6-4తో ఆరోసీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు.

క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన నాదల్

క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన నాదల్

మాజీ నంబర్‌వన్‌ రఫెల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. ఏడాది తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రఫెల్ నాదల్ సత్తా చాటాడు. ప్రీక్వార్టర్స్‌లో 6-3, 6-3, 4-6, 6-4తో ఆరోసీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. దీంతో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన నాలుగో రౌండ్లో 9వ సీడ్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6-3, 6-3, 4-6, 6-4తో గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. 2015 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవడం నాదల్‌కు ఇదే తొలిసారి. ‘‘రెండేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు ప్రత్యేకమైంది'' అని మ్యాచ్‌ అనంతరం నాదల్‌ వ్యాఖ్యానించాడు.

క్వార్టర్ ఫైనల్లో సెరెనా

క్వార్టర్ ఫైనల్లో సెరెనా

అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన అంచనాలను అధిగమిస్తూ టైటిల్‌కు మరింత చేరువైంది. నాలుగో రౌండ్‌లో బార్సరా స్ట్రయికోవాను 7-5, 6-4 తేడాతో ఓడించిన ఆమె క్వార్టర్ ఫైనల్స్ చేరింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో రెండోసీడ్ సెరెనా 7-5, 6-4తో 16వ సీడ్ బార్బోరా స్ట్రెకోవా (చెక్)పై విజయం సాధించింది. గంటా 45 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. సెరెనా సర్వీస్‌ల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో తన సర్వీస్‌లో కేవలం 45 శాతం పాయింట్లు మాత్రమే రాబట్టింది. గతేడాది విజేత, ప్రపంచ నంబర్ వన్ ఏంజెలిక్ కెర్బర్ ఓటమిపాలై నిష్క్రమించడంతో, ఈసారి టైటిల్ సాధించే అవకాశాలను సెరెనా మెరుగుపరచుకుంది. క్వార్టర్స్‌లో జొహానా కోంటా (బ్రిటన్‌)తో సెరెనా తలపడనుంది.

మిక్స్‌డ్‌ క్వార్టర్స్‌లో పేస్‌ జోడీ

మిక్స్‌డ్‌ క్వార్టర్స్‌లో పేస్‌ జోడీ

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌, మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జంట క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో పేస్‌-హింగిస్‌ జోడీ 6-2, 6-3తో రెండు వరుస సెట్లలో డెలాక్యూ-రెయిడ్‌ (ఆస్ర్టేలియా) జోడీపై విజయం సాధించింది. ఇండో-స్విస్‌ జంట ఈ మ్యాచ్‌ను 54 నిమిషాల్లోనే ముగించింది. తొలి సెట్లో నాలుగో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసి ఆధిక్యం సంపాదించిన ఈజోడీ 5-2 వద్ద మరోసారి బ్రేక్‌ సాధించింది. నెట్ వద్ద పేస్, బేస్‌లైన్ వద్ద హింగిస్ సూపర్బ్‌గా ఆడటంతో రెండోసెట్‌లో తిరుగే లేకుండా పోయింది. ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన పేస్ జంట 5-3కు చేరుకుని మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ పోరులో పేస్‌-హింగిస్‌ జోడీ 6 ఏస్‌లు కొట్టి.. 21 విన్నర్లు, మొత్తం 55 పాయింట్లు సాధించింది.

కొంటా ముందంజ

కొంటా ముందంజ

మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా), 9వ సీడ్‌ జొహానా కొంటా (బ్రిటన్‌) క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక ఐదో సీడ్‌ కరోలినా పిల్స్‌కోవా (చెక్‌రిపబ్లిక్‌) 6-3, 6-3తో రెండు వరుస సెట్లలో 22వ సీడ్‌ డరియా గావ్రిలోవా (ఆస్ర్టేలియా) పై సులువుగా నెగ్గింది. పిల్స్‌కోవా 12 ఏస్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. లూసిస్‌ బరౌని (క్రొయేషియా) 6-4, 6-2తో జెన్నీఫర్‌ బ్రాడీ (అమెరికా)పై గెలిచింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఇస్తోమిన్‌ అవుట్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఇస్తోమిన్‌ అవుట్‌

నాలుగో రౌండ్‌లో అన్‌సీడెడ్‌ ఇస్తోమిన్‌ (ఉజ్బెకిస్థాన్‌) 6-2, 6-7 (2/7), 2-6, 1-6తో పదిహేనో ర్యాంకర్‌ గ్రెగర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) చేతిలో పరాజయం పాలయ్యా డు. తొలి సెట్‌ గెలిచిన ఇస్తోమిన్‌ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయాడు. మూడు, నాలుగు సెట్లలో మాత్రం దిమిత్రోవ్‌ ముందు అతను నిలవలేకపోయాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+