Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్: నాదల్‌ ముందంజ... మార్తా, సోంగా ఔట్

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదో రోజు ఎలాంటి సంచలనాలు లేకుండానే ముగిసింది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ సాధించాలన్న కసితో ఉన్న ప్రపంచ రెండో ర్యాంకర్ కరోలినా వోజ్నియాకి ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోగా, పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ బుల్ నాదల్ పెద్దగా కష్టపడకుండానే ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.

ప్రీ క్వార్టర్స్‌లోకి నాదల్

గురువారం పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో నాదల్‌ 6-1, 6-3, 6-1తో జుముర్‌ (బోస్నియా)ను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో నాదల్‌ ముందు జుముర్‌ ఏ దశలోనూ నిలువలేకపోయాడు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ బలమైన సర్వీస్‌లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. మరోవైపు మూడో సీడ్‌ దిమిత్రోవ్‌ 6-3, 4-6, 6-4, 6-4తో రుబ్‌లెవ్‌ (రష్యా)ను ఓడించగా.. కిర్గియోస్‌ 7-6 (7-5), 4-6, 7-6 (8-6), 7-6 (7-5)తో సోంగా (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. చెరో 28 ఏస్‌లు సంధించిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

సత్తా చాటిన మారిన్‌ సిలిచ్‌

సత్తా చాటిన మారిన్‌ సిలిచ్‌

ఆరో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌, పదో సీడ్‌ కారెనొ బుస్టా (స్పెయిన్‌) కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. సిలిచ్‌ 7-6 (7-4), 6-3, 7-6 (7-4)తో హారిసన్‌ (అమెరికా)పై గెలవగా.. బుస్టా 7-6 (7-4), 4-6, 7-5, 7-5తో ముల్లర్‌ (లక్సంబర్గ్‌)పై విజయం సాధించాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన మరో పోరులో ఆండ్రియస్‌ సెప్పి (ఇటలీ) 6-3, 7-6 (7-4), 6-7 (3-7), 6-7 (5-7), 9-7తో క్రొయేషియాకు చెందిన కార్లోవిచ్‌పై విజయం సాధించాడు.

ఓటమి పాలైన మార్తా కొస్తుక్‌

ఓటమి పాలైన మార్తా కొస్తుక్‌

ఇక, 15 ఏళ్లకే ఆస్ట్రేలియన్‌ ఓపెన్ మూడో రౌండ్‌ చేరి సంచలనం సృష్టించిన ఉక్రెయిన్‌ క్రీడాకారిణి మార్తా కొస్తుక్‌ ఓటమి పాలైంది. మూడో రౌండ్లో ఆమె తన దేశానికే చెందిన నాలుగో సీడ్‌ స్వితోలినా చేతిలో 2-6, 2-6తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఐదు ఏస్‌లు కొట్టిన స్వితోలినా.. ఐదుసార్లు మార్తా సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. అనుభవం లేకపోవడంతో తడబడిన మార్తా.. 9 డబుల్‌ఫాల్ట్స్‌ చేసి ఓడిపోయింది.

అంఫైర్‌తో వాగ్వాదానికి దిగిన వోజ్నియాకి

అంఫైర్‌తో వాగ్వాదానికి దిగిన వోజ్నియాకి

రెండోసీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-4, 6-3తో కికీ బెర్టన్స్ (నెదర్లాండ్స్)పై గెలిచింది. గంటా 26 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఒకసారి సర్వీస్‌ను కోల్పోయింది. కోర్టు ఆటకు అనువుగా లేదని కాసేపు అంపైర్‌తో వాగ్వాదానికి దిగినప్పటికీ, తొలిసెట్‌ను 41 నిమిషాల్లోనే ముగించింది. రెండోసెట్‌లో సర్వీస్‌ను చేజార్చుకోవడంతో కాస్త అసంతృప్తికి లోనైన వోజ్నియాకి రాకెట్‌ను నేలకేసి కొట్టింది. వీరితో పాటు ఏడో సీడ్‌ వొస్టాపెంకో (లాత్వియా) పోరాటం ముగిసింది. ఆమె 3-6, 6-1, 3-6తో కొంటావిట్‌ (ఇస్తోనియా) చేతిలో పరాజయం పాలైంది. రేబ్రికోవా (స్లొవేకియా), అలెర్టోవా (చెక్‌ రిపబ్లిక్‌), కార్నెట్‌ (ఫ్రాన్స్‌), సురెజ్‌ నవారో (స్పెయిన్‌) కూడా ప్రిక్వార్టర్స్‌ చేరారు.

బోపన్న, శరణ్ ముందంజ

బోపన్న, శరణ్ ముందంజ

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం వేర్వేరు మ్యాచ్‌ల్లో విజయాలతో రోహన్ బోపన్న, దివి జ్ శరణ్ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో బోపన్న-రోజర్‌ వెస్లిన్‌ (ఫ్రాన్స్‌) 6-2, 7-6 (7-3)తో మేయర్‌ (అర్జెంటీనా)-సౌసా (పోర్చుగల్‌)పై.. దివిజ్‌ శరణ్‌-ఆండీ రామ్‌ (అమెరికా) 4-6, 7-6 (7-4), 6-2తో గ్రానోలర్స్‌ (స్పెయిన్‌)-ఫాగ్‌నిని (ఇటలీ)పై విజయం సాధించారు.య

Story first published: Saturday, January 20, 2018, 9:55 [IST]
Other articles published on Jan 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+