రెండో చెక్ మహిళగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్విటోవా అరుదైన ఘనత

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవా ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో 2014లో వింబుల్డన్‌ టోర్నీ తర్వాత క్విటోవా సెమీఫైనల్‌ చేరిన తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ కూడా ఇదే కావడం గమనార్హం. 2016లో కత్తి దాడికి గురయ్యాక ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌కు చేరడం క్విటోవాకు ఇదే తొలిసారి.

<strong>న్యూజిలాండ్‌పై భారత్ విజయం: సెంచరీతో మంధాన అరుదైన రికార్డు</strong>న్యూజిలాండ్‌పై భారత్ విజయం: సెంచరీతో మంధాన అరుదైన రికార్డు

గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో క్విటోవా 7-6(7/2), 6-0 తేడాతో అన్‌ సీడెడ్‌ క్రీడాకారిణి డానియెల్లీ కొలిన్స్‌(అమెరికా)పై విజయం సాధించింది. వీరిద్దరి మధ్య తొలి సెట్ హోరా హోరీగా సాగగా, రెండో సెట్‌ ఏకపక్షంగా సాగింది. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను క్విటోవా నెగ్గగా, రెండో సెట్‌లో విజయం సాధించి క్విటోవా మ్యాచ్‌ని సొంతం చేసుకుంది.

తొలిసారి ఫైనల్‌కు చేరిన క్విటోవా

దీంతో ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెట్రా క్విటోవా తొలిసారి ఫైనల్‌కు చేరింది. దీంతో 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి చెక్‌ రిపబ్లికన్‌ క్రీడాకారిణిగా క్విటోవా అరుదైన ఘనత సాధించింది. చివరగా 1991లో జోనా నవోత్నా చివరిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరగా, ఇప్పుడు క్విటోవా ఆమె సరసన చేరింది.

క్విటోవా మట్లాడుతూ

మ్యాచ్ విజయం అనంతరం క్విటోవా మట్లాడుతూ "నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఫైనల్లో ఏమి జరిగినా ప్రస్తుత గెలుపును ఎక్కువగా ఆస్వాదిస్తున్నా. తొలి సెట్‌లో కొలిన్స్‌ను తీవ్ర పోటీ ఎదుర్కొన్నా. దాంతో ఓ దశలో ఒత్తిడికి లోనయ్యా. కానీ ఒత్తిడిని తట్టుకోవడంతో టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను గెలిచా. ఇక రెండో సెట్‌లో ఎటువంటి పొరపాట్లు చేయకపోవడంతో కొలిన్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరా" అని పేర్కొంది.

క్విటోవా-కొలిన్స్‌ మధ్య పోరు సాగిందిలా

క్విటోవా-కొలిన్స్‌ మధ్య పోరు సాగిందిలా

Kvitova [8] bt Collins 7-6 (7-2) 6-0

WINNERS/UNFORCED ERRORS

Kvitova - 30/27

Collins - 9/16

ACES/DOUBLE FAULTS

Kvitova - 4/4

Collins - 2/4

BREAK POINTS WON

Kvitova - 4/10

Collins - 1/2

FIRST SERVE PERCENTAGE

Kvitova - 60

Collins - 44

PERCENTAGE OF POINTS WON ON FIRST/SECOND SERVE

Kvitova - 75/54

Collins - 67/46

TOTAL POINTS

Kvitova - 68

Collins - 54

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, January 24, 2019, 13:47 [IST]
Other articles published on Jan 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X