ఉద్విగ్నభరిత పరిస్థితి: ఫెదరర్, నాదల్ ఫైనల్ మ్యాచ్‌పై సచిన్
హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తలపడే సమయంలో వెటరన్స్ టెన్నిస్ స్టార్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లు ఎదుర్కొన్న అనుభూతిని తాను అర్థం చేసుకోగలనని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌ని కొద్దికొద్దిగా చూసిన సచిన్ వాళ్లిద్దరి మధ్య నెలకొన్న ఉద్విగ్నభరిత పరిస్థితిని అర్థం చేసుకోగలనని చెప్పాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం ఇద్దరి ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో నాదల్‌పై విజయం సాధించాడు.

నా కెరీర్‌లో చాలాసార్లు గాయాలపాలయ్యా
ఫెదరర్‌కు ఇది 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ‘నా కెరీర్‌లో చాలాసార్లు గాయాలపాలయ్యా. కొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా. 2005-06 సమయంలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీరెప్పుడు రిటైర్ అవుతారనే ప్రశ్న నాకు ఎదురైంది. ఆ తర్వాత బ్యాట్‌తోనే సమాధానం చెప్పాను. నా జీవితంలో మరచిపోలేని అనుభవాలు ఆ తర్వాతే జరిగాయి. అదే 2011 వరల్డ్ కప్' అని సచిన్' పేర్కొన్నాడు.

రోజర్ ఫెదరర్‌కు స్వతహాగా సచిన్ పెద్ద అభిమాని
రోజర్ ఫెదరర్‌కు స్వతహాగా పెద్ద అభిమాని అయిన సచిన్ టెండూల్కర్ వెటరన్ ప్లేయర్లు ఆటను ఆస్వాదించానని చెప్పుకొచ్చాడు. ‘టెన్నిస్‌కు వాళ్లు ఎంతో చేశారు. మనమూ ఆటను ఎంజాయ్ చేశాం. వాళ్ల కెరీర్‌లో సాధించిన గొప్ప విజయాలకిది కొనసాగింపు మాత్రమే. వాళ్లు అందించిన మరచిపోలేని అనుభూతులు మనతో ఎప్పటికీ ఉండిపోతాయి. నేనెప్పుడూ ఫెడరర్‌కు వీరాభిమానిని' అని సచిన్ చెప్పాడు.

అయితే బిజీ షెడ్యూల్ కారణంగా మ్యాచ్‌ను పూర్తిగా
వీక్షించలేకపోయానని, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కూర్చుని మరీ తుదిపోరును కొంతమేరకు చూశానని బాంద్రా స్టోర్ట్ ఎక్విప్‌మెంట్ కార్యక్రమం 'సచిన్ బై స్పార్టన్' కు హాజరైన సచిన్ పేర్కొన్నాడు.
బిజీ షెడ్యూల్ కారణంగా మ్యాచ్‌ను పూర్తిగా వీక్షించలేకపోయా
అయితే బిజీ షెడ్యూల్ కారణంగా మ్యాచ్‌ను పూర్తిగా వీక్షించలేకపోయానని, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కూర్చుని మరీ తుదిపోరును కొంతమేరకు చూశానని బాంద్రా స్టోర్ట్ ఎక్విప్‌మెంట్ కార్యక్రమం 'సచిన్ బై స్పార్టన్' కు హాజరైన సచిన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications