For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొత్తం మూడు రౌండ్లను ఏకధాటిగా గెలిచి..

Australian Open Day Four at Melbourne Park

హైదరాబాద్: పదిహేడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సందర్భంగా జరుగుతున్న పోరులో సీనియర్ ప్లేయర్లు ఏ మాత్రం వేగం తగ్గించకుండా కొత్త వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు.

నాదల్: ఆస్ట్రేలియా టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో దూసుకెళ్తున్నాడు. సునాయాసంగానే మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో నాదల్‌ 6-3, 6-4, 7-6 (7-4)తో లియనార్డో మేయర్‌ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఒక్క మూడో సెట్లో మాత్రమే ప్రత్యర్థి నుంచి రఫాకు ప్రతిఘటన ఎదురైంది. ఈ మ్యాచ్‌లో 40 విన్నర్లు కొట్టిన నాదల్‌.. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీసు బ్రేక్‌ చేశాడు.

అయితే మేయర్‌ 15 ఏస్‌లు సంధించినా.. నాదల్‌ బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్ల ముందు నిలువలేకపోయాడు. మరోవైపు మూడో సీడ్‌ దిమిత్రోవ్‌ (బెలారస్‌) కొద్దిలో ఓటమిని తప్పించుకున్నాడు. 22 ఏళ్ల ఆస్ట్రేలియా కుర్రాడు మెక్‌డొనాల్డ్‌ అతనికి ముచ్చెమటలు పట్టించాడు. రెండో రౌండ్లో దిమిత్రోవ్‌ 4-6, 6-2, 6-4, 0-6, 8-6తో అతికష్టమ్మీద మెక్‌డొనాల్డ్‌ను ఓడించాడు. సోంగా (ఫ్రాన్స్‌), డొల్గోపొలొవ్‌ (ఉక్రెయిన్‌), రుబెలొవ్‌ (రష్యా) కూడా మూడో రౌండ్లో ప్రవేశించారు.

మెరిపిస్తున్న కార్లొవిచ్:
క్రొయేషియా ఏస్‌ల మాస్టర్‌ ఇవో కార్లోవిచ్‌ (38 ఏళ్లు) అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో మూడో రౌండ్లో చేరిన పెద్ద వయస్కుడిగా అతను నిలిచాడు. 40 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఈ దశకు చేరిన పెద్ద వయస్కుడు కార్లోవిచే. రెండో రౌండ్లో కార్లోవిచ్‌ 7-6 (3), 6-7 (3), 7-5, 4-6, 12-10తో యుచి సుగిట (జపాన్‌)పై పోరాడి గెలిచాడు.

ఓటమి అంచులదాకా వెళ్లి: టైటిల్‌కు పోటీదారులు కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్‌), ఎలినా స్వెతొలినా (ఉక్రెయిన్‌) కొద్దిలో ఓటమి తప్పించుకున్నారు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో నాలుగో సీడ్‌ స్వితొలినా 4-6, 6-2, 6-1తో అన్‌సీడెడ్‌ సినియాకోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించగా. రెండో సీడ్‌ వోజ్నియాకి 3-6, 6-2, 7-5తో యానా ఫెట్‌ (క్రొయేషియా)పై చెమటోడ్చి గెలిచింది.

వొస్తాపెంకో (లాత్వియా), కార్నెట్‌ (ఫ్రాన్స్‌), మార్తా కోస్తాయుక్‌ (ఉక్రెయిన్‌) కూడా ముందంజ వేశారు. మర్తా అరుదైన ఘనత సాధించింది. రొగౌస్కా (ఆస్ట్రేలియా)ను ఓడించి మూడో రౌండ్‌ చేరిన ఈ అమ్మాయి.. గత 21 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఈ దశకు అర్హత సాధించిన పిన్న వయస్కురాలిగా నిలిచింది

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 18, 2018, 10:12 [IST]
Other articles published on Jan 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+