Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్: ఫెదరర్, జొకోవిచ్ ముందంజ.. ముగురుజా ఔట్

హైదరాబాద్: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాలుగో రోజు ఓవైపు భరించలేని ఎండ.. మరోవైపు ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ.. దీంతో సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో సంచలనాలు నమోదయ్యాయి.

మాజీ ఛాంపియన్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌), ముగురుజా (స్పెయిన్‌) ఓటమి పాలయ్యారు. అలాగే టాప్‌సీడ్‌ హలెప్‌, ఆరోసీడ్‌ ప్లిస్కోవా, 26వ సీడ్‌ రద్వాన్‌స్కా, అన్‌సీడెడ్‌ మరియా షరపోవా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.

పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో తొమ్మిదో సీడ్‌ వావ్రింకా 2-6, 1-6, 4-6తో సాండ్‌గ్రిన్‌ (అమెరికా) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు. ఇక రెండో సీడ్‌ రోజర్ ఫెడరర్‌ సునాయాసంగా గెలుపొందగా, మాజీ చాంపియన్‌ జొకోవిచ్‌ నాలుగు సెట్లపాటు పోరాడాల్సి వచ్చింది.

రోజర్‌ అలవోకగా... కష్టపడ్డ జొకోవిచ్

టైటిల్‌ ఫేవరెట్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌ మరో అడుగు ముందుకేశాడు. రెండో రౌండ్లో రోజర్‌ 6-4, 6-4, 7-6 (7-4)తో స్ట్రఫ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోజర్‌.. 17 ఏస్‌లతో పాటు 36 విన్నర్లు కొట్టాడు. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు.

మరోవైపు 14వ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) కాస్త కష్టపడి నెగ్గాడు. తీవ్రమైన ఎండ ఫిట్‌నె‌స్‌కు పరీక్షపెట్టిన వేళ తొలి సెట్‌ చేజార్చుకున్నా ఆ తర్వాత పుంజుకొని 4-6, 6-3, 6-1, 6-3 స్కోరుతో గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గి మూడోరౌండ్‌కు చేరాడు.

ఏడో సీడ్‌ గోఫిన్‌ (బెల్జియం) 6-1, 6-7 (5-7), 1-6, 6-7 (4-7)తో బెనిట్యూ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు. డెల్‌పొట్రో 6-4, 7-6 (7-4), 6-7, 6-4తో కచనోవ్‌ (కజక్‌స్థాన్‌)పై చెమటోడ్చి గెలవగా. డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6-7 (6-8), 3-6, 6-3, 6-2, 6-3తో కుద్లా (అమెరికా)పై కష్టపడి విజయం సాధించాడు.

మూడో రౌండ్‌కు షరపోవా, హలెప్

టాప్‌సీడ్‌ సిమోనా హలెప్‌ (రుమేనియా) 6-2, 6-2 స్కోరుతో బౌచర్డ్‌పై అలవోకగా నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్లో హలెప్‌ 6-2, 6-2తో బౌచర్డ్‌ (కెనడా)ను ఓడించగా.. కెర్బర్‌ 6-4, 6-1తో వికిచ్‌ (క్రొయేషియా)ను చిత్తు చేసింది.

మరోవైపు రష్యా భామ మరియా షరపోవా 6-1, 7-6 (4) స్కోరుతో సెవస్టోవా (లాత్వియా)పై రెండో రౌండ్‌లో అలవోకగా నెగ్గింది. ఆరోసీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-1, 6-1 స్కోరుతో హడడ్‌ మేయా (బ్రెజిల్‌)పై, 26వసీడ్‌ రద్వాన్‌స్కా (పోలెండ్‌) 2-6, 7-5, 6-3 స్కోరుతో సురెంకో (ఉక్రెయిన్‌)పై నెగ్గి మూడో రౌండ్‌లో ప్రవేశించారు.

 ముగిసిన ముగురుజా పోరాటం

ముగిసిన ముగురుజా పోరాటం

ముగురుజా (స్పెయిన్) పోరాటం రెండో రౌండ్‌కే ముగిసింది. తైవాన్‌కు చెందిన సీ సూ వీ పెద్దగా పేరున్న క్రీడాకారిణి కాదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో గతంలో నాలుగోరౌండ్‌ను కూడా దాటలేదు. అలాంటి ఈసారి సీ పెను సంచలనమే సృష్టించింది. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఎక్కడో 88వ స్థానంలో ఉన్న ఆమె వరుస సెట్లలో 7-6 (1), 6-4 స్కోరుతో వింబుల్డన్‌ చాంపియన్‌ ముగురుజ (స్పెయిన్‌)ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో 5 డబుల్‌ఫాల్ట్‌లతో పాటు నాలుగుసార్లు సర్వీసు కోల్పోయిన ముగురుజా మ్యాచ్‌ను కూడా చేజార్చుకుంది.

వావ్రింకాకు షాక్‌

వావ్రింకాకు షాక్‌

2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత స్టాన్‌ వావ్రింకా రెండోరౌండ్‌లో ఇంటిదారి పట్టాడు. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్‌ సాండ్‌గ్రెన్‌ 6-2, 6-1, 6-4 స్కోరుతో వరుస సెట్లలో వావ్రింకాను షాక్‌కు గురిచేశాడు. మరో అన్‌సీడెడ్‌ బెనెట్యూ (ఫ్రాన్స్‌) 1-6, 7-6 (5), 6-1, 7-6 (4) స్కోరు తో ఏడోసీడ్‌ గొఫిన్‌ (బెల్జియం)ను కంగుతినిపించాడు.

Story first published: Friday, January 19, 2018, 10:38 [IST]
Other articles published on Jan 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+