ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్వైటెక్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండోసీడ్, పోలెండ్ స్టార్ స్వైటెక్ 6-1, 6-0 తేడాతో ఎమ్మా రదుకాను (బ్రిటన్)ను ఓడించింది. తొలి సెట్ నుంచే దూకుడుగా ఆడిన ఈ భామ.. రెండో సెట్లో మరింత జోరు పెరిగింది. ఈ క్రమంలో స్వైటెక్ 2 ఏస్‌లతో పాటు 24 విన్నర్లు కొట్టింది. రదుకా.. 4 డబుల్‌ఫాల్ట్స్, 22 అనవసర తప్పిదాలతో ఓటమి చెందింది.
వీరు కూడా ప్రీ క్వార్టర్స్ కు
స్వితోలినా (ఉక్రెయిన్) 2-6, 6-4, 6-0 తేడాతో నాలుగో సీడ్ జేస్మిన్ పౌలిని (ఇటలీ)కి షాక్ ఇచ్చింది. గంటా 46 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో స్వితోలినా 7 ఏస్‌లతో పాటు 34 విన్నర్లు కొట్టింది. ఇంకా రిబకినా (కజకిస్థాన్), ఎమ్మా నవారో (అమెరికా), కుద్రెమెత్సెవా (రష్యా), కసత్కినా (రష్యా), లీస్ (జర్మనీ) కూడా ప్రిక్వార్టర్స్ కు అర్హత సాధించారు.

పురుషుల సింగిల్స్‌లో సినర్ జోరు
పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్ యానెక్ సినర్ (ఇటలీ) కూడా ప్రిక్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్లో 6-3, 6-4, 6-2తో గిరాన్ (అమెరికా)ను ఓడించాడు. ఈ క్రమంలోనే ఎనిమిది ఏస్‌లు కొట్టాడు. అమెరికా క్వాలిఫయర్ లియార్నర్ థియన్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. సొనెగో (ఇటలీ), డిమినార్ (ఆస్ట్రేలియా), షెల్టన్ (అమెరికా), మికెల్సన్ (అమెరికా) కూడా మూడో రౌండ్ లో గెలిచారు. అయితే నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)కు మాత్రం ఓడిపోయాడు.
బాలాజీ జోడీ ఇంటికి
పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ ఇంటిముఖం పట్టాడు. రెండో రౌండ్లో బాలాజీ-మిగ్యుల్ రేయస్ (మెక్సికో) ద్వయం 6-7 (1-7), 6-4, 3-6 తేడాతో బోర్జెస్-కబ్రాల్ (పోర్చుగీస్)పై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మూడు డబుల్‌ఫాల్ట్స్, ఐదు అనవసర తప్పిదాలతో బాలాజీ ద్వయం ఓటమిని మూటగట్టుకుంది.