For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్ర సృష్టించే దిశగా జకోవిచ్‌.. అదరగొడుతోన్న సబలెంక

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో టెన్నిస్‌ స్టార్ జకోవిచ్‌ ప్రిక్వార్టర్స్‌ చేరాడు. ఇంకా అల్కరాస్‌తో పాటు జ్వెరెవ్‌ కూడా ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సబలెంక కూడా మూడో రౌండ్‌లో నెగ్గింది.

దూసుకెళ్తోన్న జకోవిచ్
కెరీర్ లో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోన్నాడు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ (సెర్బియా). ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 11వ టైటిల్‌పై కన్నేసిన అతడు దూకుడు ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.

Australian Open 2025 Novak Djokovic Sabalenka won in third round and enters into fourth round

పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో 6-1, 6-4, 6-4 తేడాతో మచాక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించాడు జకోవిచ్. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక్కో సెట్‌ కోల్పోయిన అతడు.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. 28 విన్నర్లు, 20 అనవసర తప్పిదాలతో పాటు 9 ఏస్‌లు సంధించాడు.ఈ క్రమంలోనే రెండో సెట్‌ ప్రారంభంలో జకోవిచ్ కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. అయినా కూడా కోర్టులోనే చికిత్స తీసుకున్న అతడు ఆ తర్వాత గొప్పగా ఆడి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.

వీరు కూడా ముందంజ
రెండో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-3, 6-4, 6-4 తేడాతో జేకబ్‌ (బ్రిటన్‌)పై, మూడో సీడ్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) 6-2, 6-4, 6-7 (3-7), 6-2 తేడాతో బోర్గెస్‌ (పోర్చుగల్‌)పై విజయం సాధించారు. మెన్సిక్‌పై 3-6, 4-6, 7-6 (9-7), 6-4, 6-2 తేడాతో డేవిడోవిచ్‌ (స్పెయిన్‌) పైచేయి సాధించాడు. హంబర్ట్‌ (ఫ్రాన్స్‌), టామీ పాల్‌ (అమెరికా), జిరి (చెక్‌ రిపబ్లిక్‌) కూడా టోర్నీలో ముందంజ వేశారు.

అదరగొట్టిన సబలెంక

మహిళల సింగిల్స్‌లో వరుసగా మూడో సారి విజయం సాధించాలనే పట్టుదలతో ఆడుతోంది బెలారస్ భామ సబలెంక. మూడో రౌండ్లో 7-6 (7-5), 6-4 తేడాతో టాసన్‌ (డెన్మార్క్‌)ను ఓడించి విజయం సాధించింది. ఈ వరల్డ్ నంబర్‌వన్‌ క్రీడాకారిణికి తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో ఆ సెట్‌ టైబ్రేకర్‌కు వెళ్లగా.. అందులో సబలెంక గెలిచింది. ఇక రెండో సెట్లో దూకుడు ప్రదర్శించి మ్యాచ్‌ను దక్కించుకుంది సబలెంక.

ప్రిక్వార్టర్స్‌కు అర్హత
మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 6-4, 6-2తేడాతో ఫెర్నాండెజ్‌ (కెనడా)ను ఓడించింది. ఏడో సీడ్‌ పెగులా (అమెరికా)ను.. అన్‌సీడెడ్‌ డానిలోవిచ్‌ (సెర్బియా) 7-6 (7-3), 6-1తేడాతో పరాజయం రుచి చూపించింది. మాజీ ఛాంపియన్‌ ఒసాక (జపాన్‌) గాయం కారణంగా మ్యాచ్‌ మధ్యలోనే వైదొలిగింది. ఇకపోతే ఆండ్రీవా (రష్యా), బడోసా (స్పెయిన్‌), పవ్లీచెంకోవా (రష్యా), వెకిచ్‌ (క్రొయేషియా) కూడా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు.

చైనా అమ్మాయితో కలిసి బోపన్న శుభారంభం
పురుషుల డబుల్స్‌లో మొదటి రౌండ్లోనే రోహన్‌ బోపన్న నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కానీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జోరు చూపించాడు. తొలి రౌండ్ లోనే గెలిచి శుభారంభం చేశాడు. చైనా అమ్మాయి షూయి జంగ్‌తో కలిగి రెండో రౌండ్ కు అర్హత సాధించాడు. తొలి రౌండ్లో బోపన్న- జంగ్‌ ద్వయం 6-4, 6-4 తేడాతో డోడిగ్‌ (క్రొయేషియా)- క్రిస్టీనా (ఫ్రాన్స్‌) జోడీని ఓడించింది.

Story first published: Saturday, January 18, 2025, 7:44 [IST]
Other articles published on Jan 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+