'రాత్రి ఒంటిగంటైంది.. పడుకోరా ఇక!?' - లవ్లీ పెళ్లాం, క్యూట్ డాటర్ తో జకోవిచ్!! (వీడియో వైరల్)
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. మరో గ్రాండ్ స్లామ్ విజయమే లక్ష్యంగా ప్రస్తుతం జరుగుతోన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అద్భుత ప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా జరిగిన క్వార్టర్స్‌లో మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్‌పై విజయం సాధించి టోర్నీలో మరో అడుగు ముందుకేశాడు. సెమీ ఫైనల్ కు అర్హత సాధించాడు. అయితే ఈ మ్యాచ్ కు నొవాక్ భార్య జెలెనాతో పాటు కుమారుడు స్టీఫెన్, కుమార్తె తార హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు సోషల్ మీడియా పోస్ట్ చేయగా అది క్రీడాభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వీడియోలో జకోవిచ్.. తన భార్య, పిల్లలతో చేసిన సంభాషణ ఆకట్టుకుంటోంది.
ఇందులో ఇంటర్వ్యూ ఇచ్చిన జకోవిచ్.. తన పిల్లలు నిద్రపోయే సమయం దాటిపోయిందని చెప్పాడు. కానీ వారు తనకు మద్దత్తుగా మ్యాచ్ చూసేందుకు వాళ్లు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. "అదే సమయంలో ఇప్పుడు రాత్రి ఒంటి గంట (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం) అయింది. ఇక మీరెప్పుడు నిద్ర పోతారు?" అంటూ తన పిల్లలతోనూ సంభాషించాడు. దానికి జకోవిచ్ భార్య, పిల్లలు నవ్వుతూ ఉత్సాహంగా కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జకోవిచ్ ఫ్యామిలీ ఎంత క్యూట్ అండ్ స్టైలిష్ గా ఉన్నారో అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.

క్వార్టర్ మ్యాచ్ సాగిందిలా
వయసు పెరిగినా తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు జకోవిచ్. మూడున్నర గంటల పాటు రసవత్తరంగా సాగిన క్వార్టర్స్‌లో 4-6, 6-4, 6-3, 6-4తో మూడో సీడ్ అల్కరాస్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. తద్వారా సెమీస్ కు అర్హత సాధించాడు.
You're on the clock, Novak 😅
— #AusOpen (@AustralianOpen) January 21, 2025
Tara Djokovic's reaction to her Dad's late-night match is priceless 🕰️#AusOpen • #AO2025 pic.twitter.com/QqBKcAWi5h
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications