Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్ లో అతి చేసిన స్టార్ ప్లేయర్ - రూ.40 లక్షలు జరిమానా!!

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 బరిలోకి రష్యాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఓటమి బాధతో టోర్నీ నుంచి నిష్క్రమించిన అతడికి టోర్నీ నిర్వాహకులు జరిమానా విధించారు. టోర్నీలో క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గానూ ఈ ఫైన్ విధించారు.

తొలి రౌండ్ లో డానిల్‌ మెద్వెదెవ్‌.. 418 ర్యాంక్ కసిడిట్ సామ్రెజ్ పై విజయం సాధించాడు. ఆ సమయంలో గెలుపు ఉత్సాహంతో అతడు తన రాకెట్ తో పలుసార్లు నెట్ కెమెరాను బాది దాన్ని నాశనం చేశాడు. దీంతో అతడికి క్రమశిక్షణ చర్యల కింద 10 వేల డాలర్లు ఫైన్ వేశారు నిర్వాహకులు. మరోసారి అలా వ్యవహరించకూడదని హెచ్చరించారు.

Australian Open 2025 Daniil Medvedev fined AUD 76 000 For Misconduct In Tournament

అయినా అతడి తీరు మారలేదు. రెండో మ్యాచ్ లోనూ అలానే ప్రవర్తించాడు. రెండో రౌండ్ లో మరీ దారుణంగా 19 ఏళ్ల అమెరికా కుర్రాడు క్వాలిఫయర్ లెర్నర్ టీన్ పై ఓటమి చెందాడు. 6-3, 7-6 (4), 6-7 (10), 1-6, 7-6 (7) తేడాతో ఓడిపోయాడు.

దీంతో ఫ్రస్టేషన్ కు గురైన టీన్.. తన రాకెట్ ను నేలకేసి బాదాడు. బంతిని కూడా బ్యాక్ వాల్ కేసి బాదాడు. తన రాకెట్ బ్యాగ్ ను కూడా విసిరేశాడు. మరోసారి కెమెరాపై కూడా బాదుతూ విరుచుపడ్డాడు. అలా తన అసంతృప్తి ప్రవర్తన తీరుతో ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేశాడు. దీంతో అతడిపై మరో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నిర్వాహకులు అతడికి ఏకంగా 66 వేల డాలర్ల జరిమానా విధించారు. అలా మొత్తంగా రెండో రౌండ్లలో కలిపి మొత్తం 76 వేల డాలర్ల ఫైన్ విధిస్తున్నట్లు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.40 లక్షలు.

కాగా, గతేడాదితో పాటు 2021, 2022లోనూ మెల్‌బోర్న్‌ పార్క్‌ ఫైనల్ లో భంగపడిన మెద్వెదెవ్‌(రష్యా) ఈసారి ఎలాగైనా టైటిల్‌ దక్కించుకోవాలన్న పట్టుదలతో బరిలో దిగాడు. కానీ మళ్లీ అతడికి నిరాశే ఎదురైంది.

Story first published: Sunday, January 19, 2025, 17:40 [IST]
Other articles published on Jan 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+