ప్రపంచ నెంబర్‌వన్, బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో శుభారంభం చేసింది. అయితే తాజాగా జరిగిన తొలి రౌండ్ లో ఆమె తన ఆటతోనే కాదు డ్యాన్స్ తోనూ తన అభిమానులను అలరించింది. తొలి రౌండ్ గెలిచిన అనంతరం, మైదానంలో క్యూట్ స్టెప్పులు వేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. టిక్ టాక్ లో వైరల్ గా మారిన ఓ డ్యాన్స్ మూమెంట్ ను ఆమె రీక్రియేట్ చేస్తూ సందడి చేశారు.
వరస్ట్ డాన్సర్ గా
నా డాన్స్ అస్సలు బాగోదని తెలుసు. కానీ ఇకపై నన్ను వరస్ట్ డాన్సర్‌గా అందరూ గుర్తు పెట్టుకుంటారేమో అని చెప్పుకొచ్చింది. అయితే ఆమె డ్యాన్స్ కు ఫిదా అయిన ఆడియెన్స్, కరతాళ ధ్వనులతో సబలెంకను ఉత్సాహపరుస్.. తూ స్టాండింగ్ ఓవియేషన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

హ్యాట్రిక్ పై కన్ను
డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంక హ్యాట్రిక్‌పై కన్నేసింది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఈ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలో దిగిన ఆమె తొలి రౌండ్ లోనే విజయం సాధించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 6-3, 6-2 తేడాతో 2017 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను చిత్తు చేసింది. టైటిల్ వేటను ఘనంగా ఆరంభి, రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.
2023, 2024లో ఛాంపియన్‌గా నిలిచిన సబలెంక, ఈసారి టైటిల్ గెలిస్తే.. వరుసగా మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిళ్లు గెలిచిన ఏడో క్రీడాకారిణిగా గుర్తింపు సాధిస్తుంది.మార్టినా హింగిస్ (1997, 1998, 1999) తర్వాత మరే మహిళ కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో వరుసగా మూడుసార్లు టైటిల్ సంపాదించలేదు.
There is a first for everything 🤣
— #AusOpen (@AustralianOpen) January 12, 2025
Aryna Sabalenka and the Rod Laver Crowd do an on court TikTok 💃
#AusOpen • #AO2025 pic.twitter.com/kNtQSVyFLU