For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బార్టీ, హలెప్‌కు షాక్‌.. ఫైనల్లో జొకోవిచ్‌!!

Australian Open 2020: Sofia Kenin ends Barty Party at Australian Open, will face Garbine Muguruza in final

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ నుంచి టెన్నిస్‌కు మారిన ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌, లోకల్‌ స్టార్‌ ఆష్లే బార్టీకి షాక్‌ ఎదురైంది. స్వదేశంలో గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకోవాలన్న ఆమె ఆశలను 21 ఏళ్ల అమెరికన్‌ సోఫియా కెనిన్‌ వమ్ము చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో బార్టీ (ఆస్ట్రేలియా) 6-7(6/8), 5-7తేడాతో 14వ సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌కు చేరడం సోఫియాకు ఇదే తొలిసారి.

మరో సెమీస్‌లో మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌, ప్రస్తుతం అన్‌ సీడెడ్‌గా బరిలోకి దిగిన గాబ్రిన్‌ ముగురుజ (స్పెయిన్‌) 7-6(10/8),7-5 తేడాతో నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)ను ఓడించింది. 2017లో వింబుల్డన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరడం ముగురుజకు ఇదే తొలిసారి. సోఫియా-ముగురుజ మధ్య టైటిల్‌ పోరు శనివారం జరుగనుంది.

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌పై తన ఆధిపత్యాన్ని ప్రపంచ నెంబర్‌వన్‌ నోవాక్ జొకోవిచ్‌ మరోసారి చాటుకున్నాడు. సెమీఫైనల్లో స్విస్‌ స్టార్‌ను వరుస సెట్లలో చిత్తుచేస్తూ డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో ఏడుసార్లు చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 2 గంటల 18 నిమిషాల్లో 7-6 (7/1), 6-4, 6-3తో 20 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత రోజర్‌ ఫెదరర్‌ను ఓడించాడు.

32 ఏళ్ల జొకోవిచ్, 38 ఏళ్ల ఫెదరర్‌ మధ్య ఇది 50వ ముఖాముఖి పోరు. ఫెదరర్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ జొకోవిచ్‌ నెగ్గి ముఖాముఖి రికార్డులో 27-23తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫెదరర్‌పై జొకోవిచ్‌కిది వరుసగా నాలుగో విజయం (2020, 2016, 2011, 2008 సెమీఫైనల్స్‌). ఈ టోర్నీలో జొకోవిచ్‌పై ఫెదరర్‌ ఒక్కసారి (2007 ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌) మాత్రమే విజయం సాధించాడు. ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ తలపడతాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్లో రోహన్‌ బోపన్న (భారత్‌)-నదియా కిచోనెక్‌ (ఉక్రెయిన్‌) జంట 0-6, 2-6తో ఐదో సీడ్‌ బార్బరా క్రెజిసికోవా (చెక్‌ రిపబ్లిక్‌)-నికోలా మెక్‌టిక్‌ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడిపోయింది.

'భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్‌పై ఆలోచన ఆయితే లేదు. ప్రస్తుతానికి నా ఫామ్‌పై పూర్తి సంతృప్తిగా ఉన్నా. గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచే సత్తా నాలో ఇంకా ఉందనే అనుకుంటున్నా. వచ్చే ఏడాది కూడా ఇక్కడ ఆడతానేమో' అని రోజర్‌ ఫెదరర్‌ తెలిపారు.

'ఫెదరర్‌తో ఆడటం ఎప్పుడూ సులువు కాదు. ఈ మ్యాచ్‌లో అతని కదలికలు చూశాక పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని అర్థం అయింది. తొడల్లో నొప్పి కలుగుతోన్నా ఫెదరర్‌ తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేయడం ప్రశంసనీయం. తన 22 ఏళ్ల కెరీర్‌లో ఫెదరర్‌ 1500 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడినా.. ఏనాడూ మ్యాచ్‌ మధ్యలో గాయం కారణంగా వైదొలగలేదు. ఈ అంశమే ఫెదరర్‌పై మరింత గౌరవం పెరిగేలా చేస్తుంది' అని జకోవిచ్ అన్నారు.

Story first published: Friday, January 31, 2020, 8:26 [IST]
Other articles published on Jan 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+