న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: పోరాడి గెలిచిన నాదల్‌.. మాజీ చాంపియన్‌ కెర్బర్‌కు షాక్‌!!

Australian Open 2020: Rafael Nadal enters Mens Singles quarter-finals

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రపంచ నంబర్‌వన్‌, 'స్పెయిన్‌ బుల్‌' రఫెల్‌ నాదల్‌ తీవ్రంగా శ్రమించాడు. ప్రిక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా టెన్నిస్‌ స్టార్‌ నిక్‌ కిరియోస్‌తో మూడున్నర గంటలకు పైగా పోరాడి చివరికి విజయం సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాదల్‌ 6-3, 3-6, 7-6(8/6), 7-6(7/4) తేడాతో నిక్‌ కిరియోస్‌పై 3గంటల 38 నిమిషాల పాటు పోరాడి గెలిచాడు. తాజా విజయంతో కిరియోస్‌తో ముఖాముఖి రికార్డులో నాదల్‌ 5-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. క్వార్టర్స్‌లో డొమెనిక్‌ థీమ్‌తో నాదల్‌ తలపడనున్నాడు.

బ్రయంట్ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడని 2012లోనే జోస్యం!!బ్రయంట్ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడని 2012లోనే జోస్యం!!

మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ డొమెనిక్‌ థీమ్‌ 6-2, 6-4, 6-4 తేడాతో గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రెంచ్‌)పై సునాయాసంగా గెలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌, 15వ సీడ్‌ స్టాన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) చేతిలో నాలుగో సీడ్‌ డేనియల్‌ మెద్వదెవ్‌ (రష్యా) ఓడిపోయాడు. ఐదు సెట్ల పాటు దాదాపు మూడున్నర గంటలు సాగిన మ్యాచ్‌లో మెద్వదెవ్‌ 2-6, 6-2, 6-4, 6-7(2/7), 2-6 తేడాతో వావ్రింకా చేతిలో ఓడాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-4, 6-4, 6-4తో అండ్రె రుబ్లేవ్‌ (రష్యా)పై గెలిచి క్వార్టర్స్‌లో వావ్రింకాతో తలపడనున్నాడు.

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) 6-4, 6-4తో 16వ సీడ్‌ ఎలెసే మార్టెన్స్‌ (బెల్జియం)పై సునాయాస విజయాన్ని అందుకుంది. 9వ సీడ్‌ కికి బెర్టెన్స్‌ (నెదర్లాండ్స్‌) 3-6, 3-6తో అన్‌సీడెడ్‌ గాబ్రిన్‌ ముగురుజ (స్పెయిన్‌) చేతిలో గంటా 8 నిమిషాల్లోనే పరాజయం పాలైంది. మాజీ చాంపియన్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌కు షాక్‌ తగిలింది. 17వ సీడ్‌ కెర్బర్‌ 7-6(5), 6-7(4), 2-6తో అనస్టాసియా పవలించ్‌కొవా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. ఎస్తోనియాకు చెందిన అన్నె కొంటావిట్‌ 6-7(4), 7-5, 7-5తో ఇగా స్వియాటిక్‌ (పోలెండ్‌)పై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.

హెలికాప్టర్‌ ప్రమాదంలో అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయంట్‌ (41), ఆయన కుమార్తె గియానా (13) మృతి చెందడంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పోటీలు సోమవారం భావోద్వేగాల మధ్య జరిగాయి. నాదల్‌తో పోటీకి దిగే ముందు కోబ్‌కు నివాళిగా లాస్‌ఏంజిల్స్‌ లేకర్స్‌ జెర్సీ వేసుకొని కోర్టులో అడుగు పెట్టిన కిర్గియోస్‌ కన్నీరు పెట్టుకున్నాడు. షాక్‌కు గురయ్యానంటూ నాదల్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. మహిళల డబుల్స్‌ మూడో రౌండ్‌లో బరిలోకి దిగిన అమెరికా యువ సంచలనం కోకొ గాఫ్‌.. తన బూట్లపై రిప్‌ కోబ్‌, రిప్‌ గిగి అని రాసుకుంది.

Story first published: Tuesday, January 28, 2020, 8:25 [IST]
Other articles published on Jan 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X