Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్‌.. ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌కు భారీ షాక్!!

Australian Open 2020: Prajnesh Gunneswaran lost to Tatsuma Ito in the first-round match

మెల్‌బోర్న్‌: భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఓడిపోయాడు. జపాన్‌ ప్రత్యర్థి తత్సుమా ఇటోతో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 4-6 2-6 5-7తో భారత టాప్‌ ర్యాంకర్ ప్రజ్నేశ్‌ ఓటమిలయ్యాడు. ప్రజ్నేశ్‌ 2 గంటల 1 నిమిషం పోరాడి ఓడాడు. కనీస పోరాటపటిమ కనబరచకుండా వరుస సెట్‌లలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించాడు. మొదటి, మూడో సెట్‌లలో కాస్త పోటీ ఇచ్చిన ప్రజ్నేశ్‌.. రెండో సెట్‌లో మాత్రం ఇటో ముందు తేలిపోయాడు.

రెండు గంటల పాటు తత్సుమా ఇటో తనదైన శైలిలో రెచ్చిపోయి పోయాడు. ఏ మాత్రం తప్పిదాలకు చోటివ్వకుండా ప్రజ్నేశ్‌పై పూర్తి పైచేయి సాధించాడు. ముఖ్యంగా రెండో సెట్‌లో ప్రజ్నేశ్‌కు చెమటలు పట్టించాడు. వర్షం కారణంగా సోమవారం జరగాల్సిన ఈ మ్యాచ్ మంగళవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రజ్నేశ్‌ తొలి రౌండ్‌ దాటితే.. రెండో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్, నోవాక్ జొకోవిచ్‌ ఎదురుపడే అవకాశం ఉండే.

అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌, రోజర్ ఫెదరర్‌ సునాయాస విజయాలు అందుకోగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్, యాష్లే బార్టీ మాత్రం శ్రమించారు. ఇక అమెరికా వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌ 15 ఏళ్ల టీనేజర్‌ గండం నుండి తప్పించుకోలేకపోయింది. అమెరికా యువ క్రీడాకారిణి కోరి గౌఫ్‌ తొలి రౌండ్లో 7-6 (7/5), 6-3తో 39 ఏళ్ల వీనస్‌కు షాకిచ్చింది. గతేడాది వింబుల్డన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లోనూ గౌఫ్‌ తొలి రౌండ్లోనే వీనస్‌ను కంగుతినిపించింది. 1998లో వీనస్‌ తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడినపుడు కోరి గౌఫ్‌ ఇంకా పుట్టనే లేదు.

కార్చిచ్చు వల్ల నెలకొన్న కాలుష్యానికి తోడు భారీ వర్షం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రోజు పోటీలకు తీవ్ర ఆటంకం కలిగించింది. షెడ్యూలు ప్రకారం మొదటి రోజు జరగాల్సిన 64 మ్యాచ్‌ల్లో 18 మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. రూఫ్‌లను మూసి కొన్ని మ్యాచ్‌లను నిర్వహించారు. 32 మ్యాచ్‌లు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఏ రోజు ఆ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. టోర్నీ సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. కార్చిచ్చు దావానలంలా అంతకంతకూ వ్యాపిస్తోంది. పట్టణాలను, నగరాలను పొగ కమ్మేస్తోంది. మంగళవారం కూడా వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లకు వాయిదాలు తప్పవు.

Story first published: Tuesday, January 21, 2020, 10:51 [IST]
Other articles published on Jan 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+