Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో పోరాడి ఓడిన కోరి గౌఫ్‌.. క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌, ఫెదరర్‌!!

Australian Open 2020: Federer Joins Djokovic, Barty in Quarter-finals, Coco Gauff knocked out

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో అమెరికా 15 ఏళ్ల టీనేజ్‌ సంచలనం కోరి గౌఫ్‌ పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో వీనస్‌ విలియమ్స్‌ను, మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒసాకను ఓడించిన గాఫ్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో గాఫ్‌ 7-6 (7/5), 3-6, 0-6తో అమెరికాకే చెందిన 14వ సీడ్‌ సోఫియా కెనిన్‌ చేతిలో ఓడింది. 2 గంటల 9 నిమిషాల పాటు సాగిన పోరులో గౌఫ్‌ పోరాడి ఓడింది.

మరో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ అష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6-3, 1-6, 6-4తో అలీసన్‌ రిస్కే (అమెరికా)పై విజయం సాధించింది. ఏడో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-7 (4/7), 6-3, 6-2తో మారియా సక్కరి (గ్రీకు)పై గెలుపొందింది. క్వార్టర్స్‌ పోరులో బార్టీ-క్విటోవా తలపడనున్నారు. అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి ఆన్స్‌ జెబూర్‌ (ట్యూనిషియా) 7-6 (7/4), 6-1తో 27వ సీడ్‌ కియాంగ్‌ వాంగ్‌ (చైనా)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి అరబ్‌ మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

పురుషుల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 6-3, 6-4, 6-4తో 14వ సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)పై జయకేతనం ఎగురవేసింది. మంగళవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో కెనడాకు చెందిన 32వ సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌తో జొకోవిచ్‌ తలపడతాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రావ్‌నిచ్‌ 6-4, 6-3, 7-5తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై విజయం సాధించాడు.

పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో స్విస్‌ దిగ్గజం, అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడు రోజర్‌ ఫెదరర్‌ 4-6, 6-1, 6-2, 6-2తో మార్టన్‌ ఫక్సోవిక్స్‌ (హంగేరీ)పై గెలిచాడు. ఫెడ్‌కు ఇది 57వ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ కాగా.. ఆస్ట్రేలియాలో 15వది. 12వ సీడ్‌ ఫాబియో ఫొగ్నిని (ఇటలీ)కి 7-6 (7/5), 7-5, 6-7 (2/7), 6-4తేడాతో షాకిచ్చిన సాండ్‌గ్రెన్‌ (అమెరికా)తో రోజర్‌ తదుపరి పోరులో మంగళవారం తలపడనున్నాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం రెండో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)-నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) ద్వయం 6-4, 7-6 (7/4)తో నికోల్‌ మెలిచార్‌ (అమెరికా)-బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌) జంటను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. తొలి రౌండ్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)-ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ 6-7 (4/7), 6-3, 10-6తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో స్టార్మ్‌ సాండర్స్‌-మార్క్‌ పోల్మన్స్‌ (ఆ్రస్టేలియా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

Story first published: Monday, January 27, 2020, 9:03 [IST]
Other articles published on Jan 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+