For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో థీమ్‌.. జొకోవిచ్‌తో ఢీ!!

Australian Open 2020: Dominic Thiem edges Alexander Zverev to set up Novak Djokovic final

మెల్‌బోర్న్‌: సంచలన ప్రదర్శనలతో అదరగొట్టిన ఆస్ట్రియా ఆటగాడు డొమెనిక్‌ థీమ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో థీమ్‌ 3-6, 6-4, 7-6 (7/3), 7-6 (7/4)తో ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ను చిత్తు చేశాడు. దాంతో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా కూడా నిలిచాడు. ఓవరాల్‌గా థీమ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌.

ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌తో థీమ్‌ పోటీకి సిద్ధమయ్యాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు రఫెల్ నాదల్‌ను థీమ్‌ మట్టికరిపించిన విషయం తెలిసిందే. థీమ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ. 2018, 2019లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరి నాదల్‌ చేతిలో ఓడాడు.

3 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ పోరును థీమ్‌ తడబడుతూ ఆరంభించాడు. తొలి సెట్‌లో థీమ్‌ సర్వీస్‌లు మూడుసార్లు బ్రేక్‌ చేసిన జ్వెరెవ్‌.. జోరు కనబరిచి కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌లో థీమ్‌ పుంజుకున్నాడు. బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో చివరి వరకు జోరు కొనసాగించి సెట్‌ను 6-4తో సొంతం చేసుకున్నాడు. తర్వాతి సెట్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. చివరికి 6-6తో సమమైంది. తనకు అచ్చొచ్చిన టైబ్రేకర్‌ కావడంతో థీమ్‌ మరోసారి రెచ్చిపోయాడు. ఓ దశలో 3-0తో ముందంజ వేయడం సహా చివరికి 7-3తో ముగించి సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లో సర్వీస్‌లను కాపాడుకునేందుకు ఇద్దరు శ్రమించారు. దీంతో ఫలితం టైబ్రేకర్‌కు వెళ్లింది. ఈసారి కూడా 3-0తో దూకుడు కనబరిచిన థీమ్‌ సెట్‌ను కైవసం చేసుకొని ఫైనల్లో అడుగుపెట్టాడు.

మహిళల డబుల్స్‌ టైటిల్‌ను తిమియా బబోస్‌ (హంగేరి), క్రిస్టినీ మ్లడెనోవిక్‌ (ఫ్రాన్స్‌) ద్వయం గెలుచుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో బబూస్‌ జోడి 6-2, 6-1తో వింబుల్డన్‌ చాంపియన్‌, టాప్‌సీడ్‌ సీ సువెల్‌ (తైవాన్‌)-బార్బరా స్ట్రికోవా (హంగేరి) జంటను ఓడించింది. బబూస్‌-క్రిస్టినీ ఈ ట్రోఫీ అందుకోవడం ఇదో రెండోసారి కావడం విశేషం. 2018లోనూ ఈ జోడీ విజేతగా నిలిచింది.

టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అమెరికా యువ స్టార్‌ సోఫియా కెనిన్‌, అన్‌సీడెడ్‌ గార్బిన్‌ ముగురుజ (స్పెయిన్‌) సంచలన విజయాలతో మహిళ సింగిల్స్‌ తుది పోరుకు చేరారు. టైటిల్‌ కోసం శనివారం ఇద్దరు తలపడనున్నారు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌ ఆష్లే బార్టీని ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌ చేరిన 14వ సీడ్‌ సోఫియా మంచి జోరుమీదుంది. మరోవైపు వింబుల్డన్‌ మాజీ విజేత ముగురుజ తన పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు ముగురుజ సైతం జోరుమీదుంది. ఈ ఇద్దరిలో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకునేదెవరో ఈ రోజు మధ్యాహ్నం తేలిపోనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ సిక్స్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Story first published: Saturday, February 1, 2020, 9:07 [IST]
Other articles published on Feb 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+