For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో థీమ్‌ సంచలన విజయం.. నాదల్‌కు షాక్‌!!

Australian Open 2020: Dominic Thiem beats top-seed Rafael Nadal to reach semi-finals

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. టైటిల్‌ ఫేవరెట్, టాప్‌ సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. ఆస్ట్రియా దేశ యువ కెరటం డొమినిక్‌ థీమ్‌ అద్భుత ఆటతీరుతో క్వార్టర్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ ఆటగాడు నాదల్‌కు షాకిచ్చాడు. బుధవారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 6-7(3/7), 6-7(4/7), 6-4, 6-7(6/8) తేడాతో ఐదో సీడ్‌ డొమెనిక్‌ థీమ్‌ చేతిలో ఓడిపోయాడు. నాదల్‌ను బోల్తా కొట్టించిన థీమ్‌ తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీ ఫైనల్‌కు చేరాడు.

నాలుగు గంటలా పది నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంలో తొలి రెండు సెట్లను టై బ్రేక్‌లో కోల్పోయిన నాదల్.. మూడో సెట్‌ను సునాయాసంగానే గెలిచాడు. కానీ.. చివరిదైన నాలుగో సెట్‌లో కోలుకున్న థీమ్‌.. విజయం కోసం తుదివరకు పోరాడి ఫలితాన్ని రాబట్టాడు. 65 విన్నర్లు సంధించిన థీమ్‌.. 14 ఏస్‌లు కొట్టాడు. మరోవైపు నాదల్ 49 విన్నర్లు, 11 ఏస్‌లతో సరిపెట్టుకున్నాడు. ఈ విజయంతో 26 ఏళ్ల థీమ్‌.. గ్రాండ్‌స్లామ్స్‌లో తొలిసారి నాదల్‌పై పైచేయి సాధించాడు. గతంలో ఆరు సార్లు మేజర్‌ టోర్నీల్లో ఈ ఇద్దరు తలపడగా.. అన్నిసార్లూ నాదలే గెలుపొందాడు. ఇందులో రెండు ఫైనల్స్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2018, 2019) కూడా ఉన్నాయి.

మరో క్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 1-6, 6-3, 6-4, 6-2తో మాజీ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌)పై నెగ్గి శుక్రవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో థీమ్‌తో ఆడనున్నాడు. ప్రపంచ నాలుగో ర్యాంకరైన జ్వెరెవ్‌ గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌లో సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల కోసం ఇప్పటికే 10 వేల డాలర్లను విరాళంగా ప్రకటించిన జ్వెరెవ్‌.. ఒకవేళ టైటిల్‌ గెలిస్తే లభించే ప్రైజ్‌మనీని కూడా అందజేస్తానని ప్రకటించాడు.

మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) 6-1,6-1 తేడాతో అనెట్‌ కొంటావెట్‌ (ఇస్తోనియా )పై అలవోక విజయం సాధించింది. హలెప్‌ వరుస సెట్లలో అనెట్‌ను చిత్తుచేసి సెమీఫైనల్లో ప్రవేశించింది. సెమీస్‌ చేరే క్రమంలో హలెప్‌ ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. మరో మ్యాచ్‌లో గాబ్రిన్‌ ముగురుజ (స్పెయిన్‌) 7-5, 6-3 తేడాతో అనస్టాసియా పావ్లుచెన్కోవా (రష్యా)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.

పురుషుల సింగిల్స్‌:
జొకోవిచ్‌ X ఫెదరర్‌

మహిళల సింగిల్స్‌:
బార్టీ(ఆస్ట్రేలియా) X సోఫియా కెనిన్‌
హలెప్‌ X ముగురుజ

Story first published: Thursday, January 30, 2020, 8:23 [IST]
Other articles published on Jan 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+