న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్: భారత్ నుంచి బాల్ బాయ్స్‌గా 10 మంది, హైదరాబాద్ నుంచి ఇద్దరు!

Australian Open 2020: 10 Indian kids chosen as KIA ball-boys, express delight at the once-in-a-lifetime opportunity

హైదరాబాద్: ఈ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌‌లో భారత్‌కు చెందిన మొత్తం 10 మంది వర్ధమాన క్రీడాకారులు బాల్ కిడ్స్‌గా ఎంపికయ్యారు. ఇందులో హైదరాబాద్‌ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ టోర్నీలో వీరిద్దరూ 'బాల్‌ కిడ్స్'గా వ్యవహరించనున్నారు.

కియా మోటార్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బాల్‌ కిడ్స్‌ ఇండియా ప్రోగ్రామ్‌' ద్వారా భారత్‌లోని 10 మంది వర్ధమాన క్రీడాకారులకు ఈ అవకాశాన్ని కల్పించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 10 నగరాల్లో నిర్వహించిన సెలక్షన్స్‌లో 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న 250 మంది ఈ అవకాశం కోసం పోటీపడ్డారు.

ఢిల్లీ కోర్టుకు వందనం.. ఇప్పుడు నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుంది: యువీఢిల్లీ కోర్టుకు వందనం.. ఇప్పుడు నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుంది: యువీ

అయితే, ఇందులో మెరుగైన ప్రతిభ కనబరిచి బాల్ బాయ్స్‌గా ఎంపికైన పది మందిని పేర్లను ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల ఆదిత్య బీఎంవీ, 15 ఏళ్ల సంస్కతిలకు చోటు లభించింది. ఈ ఇద్దరూ మెల్బోర్న్ పార్క్ వద్ద విధులను నిర్వహించడంతో పాటు వారి అభిమాన టెన్నిస్ ఆటగాళ్ళు ఆటను దగ్గరుండి చూస్తారు.

లక్ష్మణ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు.. ధోనీకి దక్కని చోటు.. ఓపెనర్‌గా రాహుల్!!లక్ష్మణ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు.. ధోనీకి దక్కని చోటు.. ఓపెనర్‌గా రాహుల్!!

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత్ నుంచి బాల్‌ కిడ్స్‌గా ఎంపికైంది వీరే:
ఆదిత్య, సంస్కతి (హైదరాబాద్‌), అథర్వ హితేంద్ర (అహ్మదాబాద్‌), అత్రిజో సేన్‌గుప్తా (కోల్‌కతా), దివ్యాన్షు పాండే, హర్షిత్‌ పండిత (గురుగ్రామ్‌), రిజుల్‌ భాటియా (పంచకుల), సర్గమ్‌ సింగ్లా (చండీగఢ్‌), శారివన్‌ కౌస్తుభ్‌ (ముంబై), యశ్‌వర్ధన్‌ గౌర్‌ (చండీగఢ్‌).

Story first published: Thursday, January 9, 2020, 12:36 [IST]
Other articles published on Jan 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X