For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australian Open 2019: ఫైనల్ పోరు జకోవిచ్ Vs నాదల్, టైటిల్ విజేత ఎవరో?

Australian Open 2019: Novak Djokovic destroys Lucas Pouille to set up Rafael Nadal showdown

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ పోరు రసవత్తరంగా మారింది. మెల్‌బోర్న్ పార్క్‌లో ఆదివారం జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో దిగ్గజ టెన్నిస్ ప్లేయర్లు రఫెల్ నాదల్, నొవాక్ జోకోవిచ్ తలపడనున్నారు. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో 20 ఏళ్ల టిట్సిపాస్‌ను చిత్తు చేసి రఫెల్ నాదల్ ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.

కాగా, శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ జోకోవిచ్ (సెర్బియా)... ఫ్రెంచ్ ఆటగాడు లుకాస్ పౌలీని వరుస సెట్లలో ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చాడు. ఏకపక్షంగా సాగిన పోరులో జోకోవిచ్ 6-0, 6-2, 6-2తో ఫ్రాన్స్ ఆటగాడు లుకాస్ పౌలీని చిత్తుగా ఓడించాడు. మొత్తం 24 విన్నర్లు సంధించిన జొకోవిచ్ కేవలం 5 తప్పిదాలకు మాత్రమే పాల్పడ్డాడు.

జొకోవిచ్‌కు ఇది 34 గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. దీంతో అనుభవంతో 83 నిమిషాల్లో తొలిసారి సెమీఫైనల్ మ్యాచ్ ఆడిన లుకాస్ పౌలీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించాడు. తాజా విజయంతో ఆస్ట్రేలియా ఓపెన్‌లో రికార్డు స్థాయిలో ఏడో టైటిల్ వేటలో జొకోవిచ్ నిలిచాడు.

ఇదిలా ఉంటే, నాలుగు సార్లు ఈ టోర్నీ ఫైనల్లో ఓడిన రఫెల్ నాదల్, ఆదివారం జరగనున్న ఫైనల్లో విజయం సాధిస్తే ఓపెన్‌ ఎరాలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను కనీసం రెండేసి సార్లు నెగ్గిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. ఓపెన్‌ శకంలో ఈ ఘనతను ఇప్పటి వరకూ ఏ ఆటగాడూ అందుకోక పోవడం విశేషం.

Story first published: Friday, January 25, 2019, 17:50 [IST]
Other articles published on Jan 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+