Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా ఒసాకా: రూ. 29 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం

Australian Open 2019: Naomi Osaka beats Petra Kvitova to win title

హైదరాబాద్: గతేడాది యుఎస్ ఓపెన్ గెలుచుకున్న 21 ఏళ్ల జపాన్ యువ సంచలనం నొవొమి ఒసాకా... కొత్త ఏడాదిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. శనివారం హోరాహోరీగా జరిగిన తుది పోరులో చెక్‌ ప్లేయర్‌ పెట్రా క్విటోవాపై 7-6(2), 5-7, 6-4తేడాతో విజయం సాధించింది.

ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్‌ పోరులో క్విటోవాకు చెక్‌ చెప్పిన ఒసాకా.. వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌తో సత్తా చాటింది. గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో సెరెనాపై విజయం గాలివాటం కాదని నిరూపించింది. తాజా విజయంతో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌నూ కూడా కైవసం చేసుకుంది.
sd21 ఏళ్ల 104 రోజులు) రికార్డు నెలకొల్పింది. గతంలో 2010లో కరోలిన్‌ వోజ్నియాకి (20 ఏళ్ల 92 రోజులు) ఈ ఘనతను అందుకుంది. 2018 జనవరి నాటికి సింగిల్స్‌లో ఒసాకా ర్యాంకు 72.

ఏడాది చివరికి వచ్చేసరికి సెరెనా విలియమ్స్‌ను ఓడించి యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. మరో ఏడాది తిరిగే సరికి 72వ నుంచి నెంబర్ వన్ ర్యాంకుకి చేరింది. ఈ ఘనత సాధించిన జపాన్‌ తొలి క్రీడాకారిణి ఒసాకానే కావడం విశేషం.

అంతేకాదు... స్విస్‌ దిగ్గజం మార్టినా హింగిస్‌ (1998), డెన్మార్క్‌ భామ వోజ్నియాకి (2010) తర్వాత వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన పిన్న వయస్కురాలిగా 21 ఏళ్ల నవోమి ఒసాకా చరిత్ర సృష్టించింది.

గతేడాది యుఎస్ ఓపెన్ ఫైనల్లో

గతేడాది యుఎస్ ఓపెన్ ఫైనల్లో

గతేడాది యుఎస్ ఓపెన్ ఫైనల్లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఓడించి పెను సంచలనం సృష్టించిన ఒసాకా ఆ తర్వాత మరో నాలుగు టోర్నీల్లో ఆడినా టైటిల్‌ గెలవలేకపోయింది. అయితే, కొత్త ఏడాది ప్రారంభమైన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాత్రం నిలకడగా ఆడుతూ ఫైనల్‌ చేరింది. క్విటోవాతో 2 గంటల 27 నిమిషాలపాటు సాగిన ఫైనల్లో ఆధిక్యం చేతులు మారుతూ అభిమానులకు అసలు సిసలు టెన్నిస్‌ మజాను పంచింది.

6-6తో సెట్‌ ఫలితం టైబ్రేకర్‌కు

6-6తో సెట్‌ ఫలితం టైబ్రేకర్‌కు

తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో 6-6తో సెట్‌ ఫలితం టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేక్‌లో ఒసాకా 7-2తో పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో క్విటోవా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లిన ఒసాకా మ్యాచ్‌ను ముగించే విధంగా కనిపించింది. తొమ్మిదో గేమ్‌లో 40-0తో మ్యాచ్‌ పాయింట్‌పై నిలిచింది.

అనవసరపు తప్పిదాలు చేసిన ఒసాకా

అనవసరపు తప్పిదాలు చేసిన ఒసాకా

త్వరగా మ్యాచ్‌ను ముగించాలనే ఆత్రుతతో అనవసరపు తప్పిదాలు చేయడంతో క్విటోవా ఈ మూడింటిని కాపాడుకుంది. అనంతరం పదో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 5-5తో సమం చేసింది. మళ్లీ 12వ గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన క్విటోవా రెండో సెట్‌ను 7-5తో నెగ్గి ఫలితాన్ని మూడో సెట్‌కు తీసుకెళ్లింది. నిర్ణాయక మూడో సెట్‌లోని మూడో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

మూడో సెట్‌లో అవకాశం ఇవ్వని ఒసాకా

మూడో సెట్‌లో అవకాశం ఇవ్వని ఒసాకా

ఆ తర్వాత క్విటోవా స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా ఒసాకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని ఒసాకా మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భవిష్యత్‌ టెన్నిస్‌ స్టార్‌గా ఒసాకా ప్రశంసలు అందుకోగా.. రన్నర్‌పగా నిలిచిన క్విటోవా ఒక్క సెట్‌ కూడా చేజార్చుకోకుండా ఫైనల్‌కు చేరి మెగా ఈవెంట్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది.

ప్రైజ్‌మనీ 29 కోట్లు

ప్రైజ్‌మనీ 29 కోట్లు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన ఒసాకాకు ట్రోఫీతో పాటు రూ.29 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది. గత టోర్నీ విజేత కంటే ఇది 14 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాకుండా పురుషులతో సమానంగా అమ్మాయిలకు కూడా ఒకేలా ప్రైజ్‌మనీ దక్కుతుంది. రన్నరప్‌గా నిలిచిన క్విటోవా రూ.14 కోట్ల 88 లక్షల ప్రైజ్‌మనీ దక్కించుకుంది.

ఫైనల్లో నెగ్గడం ఒక షాక్‌లా ఉంది

ఫైనల్లో నెగ్గడం ఒక షాక్‌లా ఉంది

మ్యాచ్ అనంతరం ఒసాకా మాట్లాడుతూ "ట్రోఫీ ప్రదానోత్సవం జరుగుతున్నంతసేపూ ఇది కలయా నిజమా అన్న భావనలో ఉండిపోయా. రెండో సెట్‌లో మూడు మ్యాచ్‌ పాయింట్లు కోల్పోయినపుడు నిరాశచెందా. అయినా చివరి సెట్లో పోరాటాన్ని విడిచిపెట్టలేదు. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్నికైవసం చేసుకోవడం మరింత సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది" అని వ్యాఖ్యానించింది.

ట్రోఫీని చేజార్చుకోవడం బాధగానే ఉంది

ట్రోఫీని చేజార్చుకోవడం బాధగానే ఉంది

రన్నరప్‌గా నిలిచిన క్విటోవా మాట్లాడుతూ "ట్రోఫీని చేజార్చుకోవడం బాధగానే ఉంది. కానీ దాడి ఘటన తర్వాత నేను రాకెట్‌ పట్టుకోవడం కష్టమన్న దశనుంచి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరడం గొప్పగా భావిస్తున్నా. నేనేమీ చెత్తగా ఆడానని అనుకోవడం లేదు" అని తెలిపారు.

Story first published: Sunday, January 27, 2019, 11:01 [IST]
Other articles published on Jan 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+